ఇస్తుందని ప్రకటించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
హైదరాబాద్ : బీజేపీ కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో కొలువు తీరిన సీఎం రేవంత్ రెడ్డి పాలన పట్ల సంతృప్తి వ్యక్తం చేసింది. ఈ మేరకు భారత్ ఫ్యూచర్ సిటీ వేదికగా ఇవాల్టి నుంచి ప్రారంభం కానుంది తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ ను ప్రారంభించనుంది. రూ. 100 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు టాక్. ఇదిలా ఉండగా ఇప్పటికే వివిధ రంగాలకు చెందిన ప్రపంచంలోన 5 వేల మందికి పైగా ప్రముఖులు ఈ సమ్మిట్ కు హాజరు కానున్నారు. సోమవారం మధ్యాహ్నం రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి హాజరు కానున్నారు. దీనిపై బీజేపీ అధికారికంగా స్పందించింది.
తెలంగాణ రాష్ట్ర అభివృద్దికి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించింది. దీంతో సీఎం రేవంత్ రెడ్డికి పరోక్షంగా సంకేతాలు ఇచ్చింది. రేపు పొద్దున ఏమైనా జరిగినా , లేదా రాజకీయ సంక్షోభం ఉన్నా తాము వెనుక నుండి నడిపిస్తామని తెలిపింది. దీంతో మనోడు దూకుడు పెంచాడు. పది సంవత్సరాల పాటు తానే సీఎంనంటూ ప్రకటించాడు. మరో వైపు పార్టీలో అందరికంటే తానే సీనియర్ నని, తానే కాబోయే ముఖ్యమంత్రినంటూ మరో కీలకమైన మంత్రి పదవిలో ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొనడం కలకలం రేపింది. మొత్తంగా ప్రతిష్టాత్మకంగా ప్రారంభం అయ్యే గ్లోబల్ సమ్మిట్ కు హాజరు కానున్నారు కిషన్ రెడ్డి.






