ఏర్పాటు చేస్తామన్న అక్కినేని నాగార్జున
హైదరాబాద్ : తెలంగాణ సర్కార్ ఆధ్వర్యంలో భారత్ ఫ్యూచర్ సిటీ వేదికగా జరిగిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025లో దేశ, విదేశాల నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఈ సందర్బంగా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. సినీ రంగానికి చెందిన హీరోలు కూడా పాల్గొన్నారు. సల్మాన్ ఖాన్ కు చెందిన వెంచర్స్ సంచలన ప్రకటన చేసింది. ఈ మేరకు రూ. 10,000 కోట్లు పెట్టుబడి పెడతామని తెలిపింది. ఇందులో భాగంగా అత్యాధునిక వసతులతో కూడిన స్టూడియో నిర్మాణం చేపట్టనున్నట్లు పేర్కొంది.
ఇందులో భాగంగా టాలీవుడ్ కు చెందిన ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున సంచలన ప్రకటన చేశారు. ఆయన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో ప్రధాన ఆకర్షణగా నిలిచారు. తనను ప్రత్యేకంగా ఆహ్వానించారు ఈ సమ్మిట్ లో పాల్గొనమని. ఈ మేరకు కీలక ప్రకటన చేశారు నాగార్జున. అన్నపూర్ణ స్టూడియోస్ ను భారత్ ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ఇది వినోద రంగానికి ప్రధాన మైలురాయిని సూచిస్తుందన్నారు.








