ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రకటన
అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. ఇక నుంచి అన్ని రకాల ప్రజల సేవలు వచ్చే ఏడాది 2026 నుంచి ప్రారంభం అవుతాయని , ఈ మేరకు విస్తృతంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. అయితే సంక్రాంతి పండుగను అందరూ మంచి శుభదినంగా భావిస్తారని , అందుకే ఆరోఉ నుంచి ప్రజలకు సంబంధించి అన్ని రకాల సేవలు అందుబాటులోకి తీసుకు రానున్నట్లు వెల్లడించారు. మంగళవారం అమరావతిలోని సచివాలయంలో
రియల్ టైమ్ గవర్నెన్స్ సిస్టమ్ (RTGS)ను సమీక్షించారు. ఆన్‌లైన్ సేవలు పారదర్శకతకు దారితీస్తాయని, పాలనపై ప్రజల “సంతృప్తిని” కూడా పెంచుతాయని ముఖ్యమంత్రి నొక్కి చెప్పారు.
సంక్రాంతి పండుగ నుంచి ప్రజలకు అన్ని ఆన్‌లైన్ సేవలను విస్తరించాలని అధికారులను ఆదేశించారు నారా చంద్రబాబు నాయుడు. ఆన్‌లైన్ సేవలు పారదర్శకతకు దారితీస్తాయని, అంతే కాకుండా పాలనపై ప్రజల “సంతృప్తిని” కూడా పెంచుతాయని ముఖ్యమంత్రి నొక్కి చెప్పారు. ఇప్పటికీ ఆఫ్‌లైన్‌లో సేవలను విస్తరిస్తున్న కొన్ని విభాగాలకు తమ సేవల మాడ్యుల్ ను మార్చుకోవాలని పిలుపునిచ్చారు. టిడిపి అధినేత చెప్పిన దాని ప్రకారం, అన్ని ప్రభుత్వ సేవలను మన మిత్ర యాప్ ద్వారా వాట్సాప్ ద్వారా వర్చువల్‌గా విస్తరిస్తున్నామని, ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా చేస్తున్నామని చెప్పారు నారా చంద్రబాబు నాయుడు.






