గ్లోబల్ సమ్మిట్ 2025లో ఆవిష్కరణ
హైదరాబాద్ : సీఎం ఎ. రేవంత్ రెడ్డి నూతనంగా విద్యుత్ తో తయారు చేసిన నూతన కారును ఆవిష్కరించారు . హైదరాబాద్ లోని భారత్ ఫ్యూచర్ సిటీ ప్రాంగణంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సమ్మిట్ 2025 జరిగింది. నిన్నటితో ప్రారంభమైన ఈ సదస్సు ఇవాల్టితో ముగిసింది. 8,9వ తేదీలలో రెండు రోజుల పాటు దీనిని అద్భుతంగా చేపట్టారు. భారీ ఎత్తున ఏర్పాట్ల కోసం ఖర్చు చేసింది సర్కార్. విశ్వసనీయ సమాచారం మేరకు దాదాపు రూ. 100 కోట్లు ఖర్చు చేసినట్లు టాక్. పలు దిగ్గజ కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి.
ఇదే క్రమంలో ప్రముఖ వాహనాల తయారీ కంపెనీ తయారు చేసిన విద్యుత్ తో నడిచే కారును ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఆయనతో పాటు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, మైనార్టీ శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ , క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రాష్ట్ర రెవిన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.






