సీఎం రేవంత్ రెడ్డికి ఓయూ జేఏసీ నేతల బహిరంగ లేఖ
హైదరాబాద్ : ఓయూ జేఏసీ సీఎం రేవంత్ రెడ్డికి సుదీర్ఘ లేఖ రాసింది సమస్యలను పరిష్కరించాలని. పెద్ద ఎత్తున జాబ్స్ ఖాళీగా ఉన్నాయని, ప్రస్తుతం అంతా కాంట్రాక్టు కిందనే పని చేస్తున్నారని, చాలీ చాలని జీతాలు ఇస్తున్నారని వాపోయారు. ప్రపంచంలో పేరు పొందిన యూనివర్శిటీలలో ఉస్మానియా యూనివర్శిటీ ఒకటని పేర్కొన్నారు. గత 25 సంవత్సరాల కాలం నుండి పనిజేస్తున్న వీరి సగటు వయస్సు 55 సంవత్సరాలు అంటే అతిశయోక్తి కాదని అన్నారు. ఒక్క ఉస్మానియా యూనివర్సిటీలోనే బడ్జెటెడ్ పోస్టులు 1240 ఉంటే అందులో కేవలం 340 మంది మాత్రమే రెగ్యులర్ సిబ్బంది ఉన్నారని తెలిపారు, 670 మంది కాంట్రాక్ట్ పద్దతిలోనే సేవలు అందిస్తున్నారని వాపోయారు.
రాష్ట్రంలోని విశ్వ విద్యాలయాలన్నీ కాంట్రాక్ట్ , పార్ట్ టైమ్ లెక్చరర్లతోనే నడుస్తున్నయని తెలిపారు. వీల్లందరికి ఉద్యోగ భద్రత కల్పించి మానవీయ ధృక్పదంతో వీరందరిని రెగ్యులరైజ్ చేయాలని, అప్పటి వరకు వీరికి సుప్రీం ధర్మాసనం తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని కోరారు
చాలా కాలంగా చాలీచాలని జీతాలతో పనిచే స్తున్నటువంటి బోధనేతర, టైం స్కేల్ ఉద్యోగులని క్రమబద్ధీకరించాలని కోరారు లేఖలో. నాన్ టీచింగ్, టైం స్కేల్లో పని చేస్తున్నటువంటి ఉద్యోగస్తులకు 60 శాతం ఈపీఎఫ్ చెల్లించాలని కోరారు. ఔట్సోర్సింగ్ లో పని చేస్తున్నటువంటి ఉద్యోగుల శ్రమ దోపిడిని అరికట్టాలని, వారికి రెగ్యులర్ ఉద్యోగులతో సమానమైన జీతాన్ని ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డికి విన్నవించారు.






