రేవంత్ రెడ్డి ద‌మ్మున్న నాయ‌కుడు

Spread the love


ప్ర‌శంస‌లు కురిపించిన హ‌నుమంత రావు

హైద‌రాబాద్ : మాజీ ఎంపీ వి. హ‌నుమంత రావు ప్ర‌శంస‌లు కురిపించారు రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డిపై. ఆయ‌న ముందు చూపు క‌లిగిన నాయ‌కుడ‌ని పేర్కొన్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఏ సీఎం ఇలా ఆలోచించ లేద‌న్నారు. భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ వేదిక‌గా గ్లోబ‌ల్ స‌మ్మిట్ ను విజ‌య‌వంతంగా నిర్వ‌హించ‌డంలో స‌క్సెస్ అయ్యార‌ని చెప్పారు. అంతే కాకుండా గ‌త 10 ఏళ్ల బీఆర్ఎస్ హ‌యాంలో చారిత్ర‌క నేప‌థ్యం క‌లిగిన ఉస్మానియా యూనివ‌ర్శిటీని ప‌ట్టించు కోలేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. కానీ సీఎం గా రేవంత్ రెడ్డి కొలువు తీరాక దాని గురించి ఆలోచించడం అభినంద‌నీయ‌మ‌న్నారు.

ఇందులో భాగంగా ఏకంగా ఓయూ అభివృద్ది కోసం రూ. 1000 కోట్లు కేటాయించ‌డం మామూలు విష‌యం కాద‌న్నారు. ఎంద‌రో ప్ర‌ముఖుల‌ను రాష్ట్రానికి, దేశానికి, ప్ర‌పంచానికి అందించిన ఘ‌న‌త ఈ విశ్వ విద్యాల‌యానికి ఉంద‌న్నారు. మాజీ ప్ర‌ధాన మంత్రి పీవీ న‌ర‌సింహారావు, ఉత్త‌మ పార్ల‌మెంటేరియ‌న్ దివంగ‌త సూదిని జైపాల్ రెడ్డి, ప్ర‌జా యుద్ద నౌక గ‌ద్ద‌ర‌న్న లాంటి వాళ్లు ఇక్క‌డే చ‌దువుకున్నార‌ని గుర్తు చేశారు. తెలంగాణ చైతన్యానికి ప్రతీక ఉస్మానియా యూనివర్సిటీ ని సందర్శించడం ఆనందంగా ఉంద‌న్నారు వి. హ‌నుమంత రావు. ఈ చదువుల వేదికను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయాలన్న సంకల్పం తీసుకోవ‌డం అభినంద‌నీయ‌మ‌న్నారు.

  • Related Posts

    రేవంత్ రెడ్డి చెప్పేవ‌న్నీ అబ‌ద్దాలే : హ‌రీశ్ రావు

    Spread the love

    Spread the loveఏం సాధించావ‌ని కేర‌ళ‌కు వెళ్లావో చెప్పాలి హైద‌రాబాద్ : మాజీ మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న సీఎం ఎ. రేవంత్ రెడ్డిని ఏకి పారేశారు. ఇవాళ మీడియాతో మాట్లాడారు. నోరు తెరిస్తే అబ‌ద్దాలు…

    జీవ‌న్ రెడ్డి ఏ పార్టీలోకి వెళ‌తారు..?

    Spread the love

    Spread the loveఆయ‌న‌కు అంత సీన్ లేద‌న్న గౌడ్ హైద‌రాబాద్ : కాంగ్రెస్ పార్టీకి సుదీర్ఘ కాలం పాటు సేవ‌లు అందిస్తూ వ‌చ్చిన మాజీ మంత్రి టి. జీవ‌న్ రెడ్డి త‌ను పార్టీ వీడడం ప‌ట్ల స‌ర్వ‌త్రా చ‌ర్చ‌కు దారి తీసింది.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *