కీలక అంశాలపై చర్చించిన ఐటీ శాఖ మంత్రి
అమెరికా : ఏపీ ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ అమెరికా పర్యటనలో బిజీగా ఉన్నారు. ఈ సందర్బంగా శాన్ ఫ్రాన్సిస్కోలో ఉన్న ప్రముఖ దిగ్గజ ఐటీ కంపెనీ గూగుల్ సంస్థను సందర్శించారు. ముఖ్య కార్య నిర్వహణ అధికారి (సీఈఓ) సుందర్ పిచాయ్ ని మర్యాద పూర్వకంగా కలిశారు. విశాఖ వేదికగా గూగుల్ చేపట్టిన ఏఐ ప్రాజెక్టు గురించి విస్తృతంగా చర్చించారు. అనంతరం అడోబ్ సంస్థ సీఈఓ శంతను నారాయణ్ ను కలిశారు.
తనతో మళ్ళీ సమావేశం కావడం చాలా బాగుందంటూ ఈ సందర్బంగా పేర్కొన్నారు మంత్రి నారా లోకేష్. విశాఖపట్నంలో గ్లోబల్ కెపాబిలిటీ , డెవలప్‌మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని అడోబ్ ముఖ్య కార్య నిర్వహణ అధికారిని ఆహ్వానించారు. డిజిటల్ ఆవిష్కరణలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్థానాన్ని మరింత బలోపేతం చేయడానికి, కల్పిత రూపకల్పన, పరిశోధన, ఆరోగ్య-సాంకేతికత, జీవ శాస్త్రాల పెట్టుబడుల కోసం మన ప్రపంచ స్థాయి AMTZ , ఫార్మా జోన్‌లను ఉపయోగించడంలో లోతైన సహకారం గురించి కూడా విస్తృతంగా నారా లోకేష్ చర్చించారు శంతను నారాయణ్ తో.






