కల్పిస్తామన్న సీఈఓ రవి కుమార్
విశాఖపట్నం : కాగ్నిజెంట్ ఐటీ కంపెనీ సీఈఓ రవికుమార్ కీలక ప్రకటన చేశారు. రాబోయే రోజుల్లో 25 వేల మందికి పైగా జాబ్స్ కల్పిస్తామని ప్రకటించారు. దీని వల్ల ఏపీకి చెందిన ప్రతిభ కలిగిన విద్యార్థులు, అభ్యర్తులకు మేలు చేకూరుతుందన్నారు. విశాఖలో కాగ్నిజెంట్ కార్యాలయ శంకుస్థాపన కార్యక్రమంలో కాగ్నిజెంట్ సంస్థ సీఈఓ రవికుమార్ ఈ విషయాన్ని వెల్లడించారు. టెక్నాలజీ మారుతూనే ఉంటుందని, దానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు అప్ డేట్ కావాలని సూచించారు. లేకపోతే వెనుకబడి పోతామన్నారు. ఏఐ వల్ల కొన్ని ఉద్యోగాలు పోయినప్పటికీ డేటా సైన్స్ , డేటా అనలిటిక్స్, అనాలసిస్ కు విపరీతమైన డిమాండ్ ఉందన్నారు.
కాస్తంత ఫోకస్ పెడితే, కష్టపడితే జాబ్స్ తప్పకుండా వస్తాయని, కాక పోతే కాన్ఫిడెన్స్ కలిగి ఉన్నప్పుడే ఇది సాధ్యం అవుతుందన్నారు. కాగ్నిజెంట్ సంస్థకు సంపూర్ణ సహకారం అందించినందుకు రాష్ట్ర సర్కార్ కు ప్రత్యేకించి సీఎం నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ కు ధన్యవాదాలు తెలిపారు. ఇక విశాఖ కాగ్నిజెంట్ సంస్థలో 25 వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని వెల్లడించారు సీఈఓ రవికుమార్. కాగా కాగ్నిజెంట్. ముందుగా 8 వేల మందికి మాత్రమే ఉద్యోగాలు కల్పిస్తామని ఒప్పందం చేసుకుంది. కానీ సర్కార్ సూచన మేరకు అదనంగా జాబ్స్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామన్నారు సీఈఓ.






