ప్రకటించిన డీజీపీ శివధర్ రెడ్డి
హైదరాబాద్ : ఫుట్ బాల్ ఆటగాడు మెస్సీ హైదరాబాద్ సందర్బంగా భారీ ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ప్రకటించారు తెలంగాణ డీజీపీ శివ ధర్ రెడ్డి. తను మూడు రోజుల పాటు ఇండియాలో పర్యటిస్తున్నారు. మొదట శనివారం ఉదయం భారీ భద్రత మధ్య 11.30 గంటలకు చేరుకున్నారు. స్టేడియంకు చేరుకోవడం , అక్కడ తను మ్యాచ్ ఆడక పోవడంతో అభిమానులు నిరాశకు గురయ్యారు. ఆపై పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. కుర్చీలను ఎత్తి వేశారు. చివరకు గందరగోళ పరిస్థితులు చోటు చేసుకున్నాయి. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. ఈ మేరకు ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. దీనిపై స్పందించారు డీజీపీ రాజీవ్ కుమార్. నిర్వాహకుల నిర్లక్ష్యం, నిర్వహణ లోపం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ తరుణంలో సాయంత్రం హైదరాబాద్ కు రాక సందర్బంగా భారీ ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేశారు. దీనిపై స్పందించారు డీజేపీ శివ ధర్ రెడ్డి. 3 వేల మందికి పైగా పోలీసులను మోహరించామన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. కోల్ కతా ఘటన నేపథ్యంలో తాము పూర్తిగా అప్రమత్తంగా ఉన్నామన్నారు. నిరంతరం పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. ఏ ఒక్కరు తలతిక్క వేషాలు వేసేందుకు ప్రయత్నం చేసినా తాము ఊరుకునేది లేదన్నారు. కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు డీజీపీ శివధర్ రెడ్డి. ఓ వైపు సిటీ పోలీస్ కమిషనర్ సీవీ సజ్జనార్, రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబులతో పాటు ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు.






