బీసీసీఐ సెలెక్షన్ చైర్మన్, హెడ్ కోచ్ పై మండిపాటు
హైదరాబాద్ : భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ సీరియస్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం బీసీసీఐ అనుసరిస్తున్న విధానాలను ఆయన తప్పు పట్టారు. ప్రధానంగా కేరళ స్టార్ క్రికెటర్ సంజూ శాంసన్ పట్ల అనుసరిస్తున్న వివక్షను ప్రత్యేకంగా ప్రస్తావించారు. శనివారం ఆయన ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వూలో క్రికెటర్లను ఎంపిక చేసే విధానం బాగోలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరైనా ప్రతిభను ఆధారంగా ఆటగాళ్లను పరిగణలోకి తీసుకుంటారని అన్నాడు. కానీ ఎంపిక కమిటీ చైర్మన్ అగార్కర్ , హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తీసుకుంటున్న నిర్ణయాలను తీవ్రంగా తప్పు పట్టాడు. ఇది మంచి పద్దతి కాదన్నాడు. వచ్చే ఏడాదిలో టి20 వరల్డ్ కప్ జరగనున్న నేపథ్యంలో పరిణతి చెందిన ఆటగాళ్లను పక్కన పెట్టడం దారుణం అన్నాడు.
ప్రత్యేకించి కపిల్ దేవ్ సంజూ శాంసన్ గురించి కామెంట్స్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది క్రికెట్ వర్గాలలో. తనతో పాటు ఇప్పటికే మాజీ భారత జట్టు కెప్టెన్ సునీల్ గవాస్కర్, స్టార్ బౌలర్ ఇర్ఫాన్ పఠాన్ తో పాటు మాజీ క్రికెటర్లు, అనలిస్టులు సైతం తప్పు పట్టారు గంభీర్ ఒంటెద్దు పోకడ పోతున్నాడని. ఒక్క శుభ్ మన్ గిల్ కోసం యశస్వి జైశ్వాల్, రింకూ సింగ్, సంజూ శాంసన్ ల కెరీర్ లను నాశనం చేసే హక్కు మీకు ఎవరు ఇచ్చారంటూ నిలదీశారు కపిల్ దేవ్. ఇప్పటి వరకు శుభ్ మన్ గిల్ 30 ఇన్నింగ్స్ లు ఆడి 263 రన్స్ చేసినా ఇంకా ఎందుకు కొనసాగిస్తున్నారని ఫైర్ అయ్యాడు.






