ప్రకటించిన మంత్రి పొంగూరు నారాయణ
అమరావతి : ఏపీ రాజధాని అమరావతిలో భూమి లేని పేదలకు సంబంధించిన పెన్షన్లపై కీలక నిర్ణయం తీసుకుంది త్రిసభ్య కమిటీ. శనివారం ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు రాష్ట్ర పురపాలిక , పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ. 4,929 మంది పెన్షన్లపై త్రిసభ్య కమిటీ పునరాలోచన చేస్తోందని చెప్పారు. రద్దు అయిన పెన్షన్లపై దరఖాస్తుల స్వీకరణకు CRDA గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నారు మంత్రి. అర్హులైన వారికి నెలకు రూ.5 వేల పెన్షన్ ఇచ్చే యోచన చేస్తున్నామన్నారు. గ్రామ సభల సమయంలో అర్జీలు సమర్పించేందుకు వీలు కల్పించడం జరిగిందన్నారు.
భూమి లేని పేదలను ఆదుకోవాలని ఏపీ సర్కార్ నిర్ణయించిందన్నారు. ఇటీవల సీఎం నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కీలక సమావేశం జరిగిందన్నారు. ఇప్పటికే తమ సర్కార్ కొలువు తీరిన వెంటనే రాజధాని అమరావతికి సంబంధించి త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసిందని చెప్పారు మంత్రి పొంగూరు నారాయణ. సీఆర్డీఏ కూడా కీలక మీటింగ్ జరిగిందన్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే సీఆర్డీఏ కీలక నిర్ణయం తీసుకుందన్నారు పొంగూరు నారాయణ. భూములు కోల్పోయిన వారు లేదా లేని వాళ్లకు భరోసా కల్పించేందుకు చర్యలు తీసుకోవడాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. పేదలకు న్యాయం చేసేందుకు పెన్షన్లు ఇవ్వాలని సూచించడం జరిగిందన్నారు నారాయణ.






