తొలి రోజే రికార్డు స్థాయిలో కలెక్షన్స్
హైదరాబాద్ : నందమూరి బాలకృష్ణ కీ రోల్ పోషించిన బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన సీక్వెల్ మూవీ అఖండ -2 తాండవం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కోర్టు స్టే కారణంగా ఆగి పోయిన మూవీ ఉన్నట్టుండి అన్ని అడ్డంకులను దాటేసి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీంతో బాలయ్య ఫ్యాన్స్ కు ఫుల్ భోజనం పెట్టేలా చేశాడు దర్శకుడు. విడుదలైన నాటి నుంచే పాజిటివ్ టాక్ రావడంతో జనం సినిమాను చూసేందుకు టాకీస్ లకు వస్తున్నారు. అఖండ -1 మూవీ దుమ్ము రేపింది. కలెక్షన్ల పరంగా భారీ ఎత్తున డబ్బులు రావడంతో దర్శకుడు బోయపాటి శ్రీను సీక్వెల్ కు ప్లాన్ చేశాడు.
ఈ సినిమాకు అదనపు ఆకర్షణ సంగీతం. సంగీత దర్శకుడు ఎస్ ఎస్ థమన్ మరోసారి సత్తా చాటాడు. బాలయ్య అంటేనే రెచ్చి పోయే తను ఈ సీక్వెల్ కోసం కూడా అద్బుతంగా , ఫ్యాన్స్ కు మరిచిపోలేని విధంగా సంగీతాన్ని, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చాడు. ఇదే సినిమాకు అసెట్ గా ఉందన్న టాక్ ఉంది. ఇదిలా ఉండగా విడుదలైన తొలి రోజే ఏకంగా అఖండ-2 దూసుకు పోతోంది కలెక్షన్స్ పరంగా. ఏకంగా తొలి రోజు రూ. 28 కోట్లు వసూలైనట్లు టాలీవుడ్ టాక్. ఈసారి బాలయ్య మూవీని పాన్ ఇండియా మూవీగా విడుదల చేశారు. మొత్తంగా తొలి షో నుంచే పాజిటివ్ టాక్ రావడంతో భారీ ఎత్తున వసూళ్లతో దూసుకు పోతోంది.








