ఫిదా అయిన లియోనెల్ మెస్సీ
హైదరాబాద్ : ఎన్నో నగరాలు తిరిగాను. ఎందరితో కలిశాను. మరెందరో తమ ప్రేమను పంచారు. అద్భుతంగా ఆదరించారు. కానీ ఎక్కడా లేనంతటి ప్రేమను ను హైదరాబాద్ లో పొందానని అన్నారు ప్రముఖ ఫుట్ బాల్ దిగ్గజం , అర్జెంటీనా జట్టు కెప్టెన్ లియోనెల్ మెస్సీ. ఆయన మూడు రోజుల పర్యటనలో భాగంగా ఇండియాలో ఆదివారం కాలు మోపారు. భారీ భద్రత నడుమ కోల్ కతాకు వెళ్లారు. అక్కడి నుంచి నేరుగా సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ కు చేరుకున్నారు. తనకు ఘనస్వాగతం పలికారు సీఎం రేవంత్ రెడ్డి. ఆయనతో పాటు కాంగ్రెస్ అగ్ర నాయకుడు , ఎంపీ రాహుల్ గాంధీ కూడా తనతో సంభాషించారు. అందరూ కలిసి చౌమొహల్లా ప్యాలెస్ లో జరిగిన విందుకు హాజరయ్యారు.
కట్టుదిట్టమైన సెక్యూరిటీ మధ్య లియోనెల్ మెస్సీ, సీఎం రేవంత్ రెడ్డి, ఎంపీ రాహుల్ గాంధీలు కలిసి రాత్రి 7 గంటలకు ఉప్పల్ రాజీవ్ గాంధీ స్టేడియంకు చేరుకున్నారు. ఈ సందర్బంగా వేలాది మంది అభిమానులు మెస్సీని చూసి తట్టుకోలేక పోయారు. వుయ్ లవ్ యూ మెస్సీ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సీఎంతో కలిసి ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడాడు మెస్సీ, మైదానం అంతటా కలియ తిరుగుతూ ప్రేక్షకులకు అభివాదం చేశారు. చేసిన ఏర్పాట్లపై ప్రశంసలు కురిపించాడు దిగ్గజ ఆటగాడుఈ వేడుక స్ఫూర్తిని మరింత పెంచింది. మెస్సీ జట్టు యువ అభిమానులతో ఫోటోలకు కూడా పోజులిచ్చారు. మంగ్లీ, రాహుల్ సిప్లిగంజ్ పాటలు ఆకట్టుకున్నాయి.
గౌరవ సూచకంగా అర్జెంటీనా జట్టు జెర్సీ నంబర్ 10ను రాహుల్ గాంధీ , రేవంత్ రెడ్డిలకు బహుకరించారు. ప్రతిగా, ఇద్దరు నాయకులు మెస్సీకి జ్ఞాపికలను బహూకరించారు.






