బిగ్ బాస్ -9 రేసులో త‌నూజ టాప్

Spread the love

అంద‌రి క‌ళ్లు ఈ కంటెస్టెంట్ పైనే

హైద‌రాబాద్ : పూర్తి వినోదాన్ని అందిస్తూ టాప్ రేటింగ్ లో దూసుకు పోతోంది స్టార్ లో బిగ్ బాస్ -9 తెలుగు సీజ‌న్. ఈ షో ఆఖ‌రి అంకానికి చేరుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఐదుగురు ఫైన‌ల్ దాకా వ‌చ్చారు. చివ‌రి ఫైన‌లిస్టులో ముగ్గురు చేరుకున్నారు. వారిలో శ్రీ‌కాంత్ పెద్దాల‌, ఇమ్మాన్యూయెల్ తో పాటు త‌నూజ నిలిచారు. వీరిలో ఓటింగ్ ప‌రంగా చూస్తే టాప్ లో కొన‌సాగుతోంది తనూజ‌. ఈనెల 21వ తేదీన గ్రాండ్ పినాలే జ‌ర‌గ‌నుంది. ఈ విష‌యాన్ని ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు నిర్వాహ‌కులు. ఇప్ప‌టి దాకా ప్ర‌ముఖ న‌టుడు అక్కినేని నాగార్జున దీనిని హోస్ట్ చేస్తూ వ‌చ్చారు.

చివ‌రి దాకా ఇమ్మాన్యూయెల్ త‌నూజ మ‌ధ్య కీల‌క‌మైన పోటీ నెల‌కొంద‌ని టాక్. కానీ ఇప్ప‌టికే త‌నూజ ఫైన‌ల్ అయ్యింద‌ని , ఇక మిగిలింది త‌ను ట్రోఫీ తీసుకోవ‌డం, ప్రైజ్ మ‌నీ తీసుకునేందుకు రెడీగా ఉండాల‌ని ఇప్ప‌టికే స‌మాచారం కూడా అందిన‌ట్లు పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంది. పెద్ద ఎత్తున త‌నూజ‌కు మ‌ద్ద‌తుగా ఓటింగ్ లో పాల్గొంటున్నారు. త‌ను ఆడిన తీరు, ప్ర‌ద‌ర్శించిన తెలివి తేట‌లు క‌లిపి త‌న‌ను టాప్ లో ఉండేలా చేశాయ‌ని స‌మాచారం. మొత్తంగా బిగ్ బాస్ తెలుగు 9 సీజ‌న్ షో అల‌రిస్తూ వ‌చ్చింది. అయితే ఇంకా స‌స్పెన్స్ వీడ‌డం లేదు. ఎవ‌రు విన్న‌ర్ గా నిలుస్తార‌నే దానిపై. నిర్వాహ‌కులు ఇంకా ప్ర‌క‌టించ లేదు. మొత్తంగా సోష‌ల్ మీడియాలో మాత్రం త‌నూజ పేరు ట్రెండ్ లో కొన‌సాగుతోంది.

  • Related Posts

    జ‌న‌వ‌రి 12న మెగాస్టార్ మూవీ రిలీజ్

    Spread the love

    Spread the loveప్ర‌క‌టించిన ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి హైద‌రాబాద్ : ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. త‌ను ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన మెగాస్టార్ చిరంజీవి, ల‌వ్లీ బ్యూటీ న‌య‌న‌తార క‌లిసి న‌టించిన మ‌న శంక‌ర ప్ర‌సాద్ గారు మూవీ విడుద‌ల…

    నంద‌మూరి బాల‌య్య సినిమానా మ‌జాకా

    Spread the love

    Spread the loveతొలి రోజే రికార్డు స్థాయిలో క‌లెక్ష‌న్స్ హైద‌రాబాద్ : నంద‌మూరి బాల‌కృష్ణ కీ రోల్ పోషించిన బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన సీక్వెల్ మూవీ అఖండ -2 తాండ‌వం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. కోర్టు స్టే కార‌ణంగా ఆగి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *