తెలంగాణ సైబర్ సెక్యూరిటీ వింగ్ ఎస్పీ సాయి శ్రీ
వరంగల్ జిల్లా : అపరిచిత వ్యక్తులు, సామాజిక మాధ్యమాల్లో గాని తమ వ్యక్తిగత సమాచారాన్ని షేర్ చేసుకోవద్దని సైబర్ సెక్యూరిటీ ఎస్పీ సాయి శ్రీ కోరారు. “ఫ్రాడ్ కా ఫుల్ స్టాప్” కార్యక్రమంలో భాగంగా సైబర్ సెక్యూరిటీవి వరంగల్ కమిషన్ విభాగం ఆధ్వర్యంలో బొల్లికుంట వాగ్దేవి ఇంజనీరింగ్ కళాశాలలో సైబర్ నేరాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ వింగ్ ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీవింగ్ డైరెక్టర్ షికా గోయల్ ఆధ్వర్యంలో ఫ్రాడ్ కా ఫుల్ స్టాప్ కార్యక్రమం ద్వారా తెలంగాణ వ్యాప్తంగా సైబర్ నేరాలపై ప్రజలతో పాటు విద్యార్థులకు అవగాహన కల్పించడం జరుగుతోందని చెప్పారు. ఈ డిజిటల్ నేరాలపై ప్రతి ఒక్కరికి అవగాహన తప్పనిసరిగా ఉండాలని అన్నారు.
డిజిటల్ అరెస్ట్, లోన్ యాప్ లు, పెట్టుబడి మోసాలు, మ్యాట్రిమోనీ, ట్రేడింగ్ యాప్స్ ద్వారా సైబర్ నేరగాళ్ళు ఏవిధంగా మోసాలకు పాల్పడటం జరుగుతుందో వివరంగా తెలియ చేశారు ఎస్పీ సాయి శ్రీ. అలాగే ఇలాంటి సైబర్ మోసగాళ్ల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఎస్పీ వివరించడంతో పాటు, ఒక వేళ ఎవరైనా సైబర్ నేరగాళ్ళ చేతుల్లో మోసపోతే తక్షణమే 1930 నంబర్ కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. అదేవిధంగా http://cybercrime.gov.in వెబ్ సైట్ ను సందర్శించాలని కోరారు.
సైబర్ నేరగాళ్ళ చేతుల్లో మోసపోయిన అనంతరం చర్యలు తీసుకోవడం కాకుండా వారిచేత మోస పోకుండా ముందుగానే అప్రమత్తంగా వుంటే ఇలాంటి సైబర్ నేరాలకు చెక్ పెట్టగలమని ఎస్పీ తెలియచేసారు.
అనంతరం సైబర్ నేరాల పట్ల ఏవిధంగా అప్రమత్తం వుండాలని విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించారు.
ఈ కార్యక్రమంలో సైబర్ సెక్యూరిటీ వింగ్ వరంగల్ విభాగం డీ.ఎస్పీ గిరికుమార్, ఇన్స్ స్పెక్టర్లు యాసిన్, అశోక్ కుమార్, కళాశాల ప్రిన్స్ పాల్ ప్రకాష్, ఎస్.ఐలు చరణ్ కుమార్, శివ కుమార్, ఎస్.బి.ఐ ప్రాంతీయ మేనేజర్ అబ్దుల్ రహీమ్ షేక్, తో పాటు కళాశాల హెచ్.ఓ.డి లు ఇతర కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.





