ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు పాలాభిషేకం

రోడ్డు వేసినందుకు గిరిజ‌నుల ఆనందం

అమ‌రావ‌తి : ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొణిద‌ల ఇచ్చిన మాట నిల‌బ‌బెట్టుకునేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నారు. పాల‌నా ప‌రంగా ఆయ‌న దూకుడు పెంచారు. ప్ర‌తి వారం ప్ర‌జా ద‌ర్బార్ నిర్వ‌హించేలా త‌మ పార్టీకి చెందిన ప్ర‌జా ప్ర‌తినిధుల‌కు దిశా నిర్దేశం చేశారు. ఈ మేర‌కు డిప్యూటీ సీఎం ఆదేశాల మేర‌కు జ‌న‌సేన పార్టీ ప్ర‌ధాన కార్యాల‌యంలో ఆ పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎమ్మెల్సీ కొణిద‌ల నాగ‌బాబు ఆధ్వ‌ర్యంలో ప్ర‌జ‌ల‌తో ఆర్జీల‌ను స్వీక‌రిస్తున్నారు. ఇదే స‌మ‌యంలో ఆయా శాస‌న స‌భ నియోజ‌క‌వ‌ర్గాల‌లో ఎమ్మెల్యేలు, లోక్ స‌భ నియోజ‌క‌వ‌ర్గాల‌లో ఎంపీలు సైతం ప్ర‌జా ద‌ర్బార్ చేప‌డుతున్నారు. తాజాగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఉప్పాడ తీర ప్రాంతంలో నెల‌కొన్న స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించేందుకు యాక్ష‌న్ ప్లాన్ త‌యారు చేయించారు.

ఈ మేర‌కు మ‌త్స్య‌కారుల‌కు ఉపాధి , శిక్ష‌ణ క‌ల్పించేలా చ‌ర్య‌లు చేప‌ట్టారు. ఇప్ప‌టికే త‌మిళ‌నాడు, కేర‌ళ‌, త‌దిత‌ర ప్రాంతాల‌లో వారికి మెరుగైన ట్రైనింగ్ ఇస్తున్నారు. ఇదే స‌మ‌యంలో భారతదేశంలో బీహార్, ఛత్తీస్‌గఢ్, పశ్చిమ బెంగాల్, ఒరిస్సా, అస్సాం మొదలైన రాష్ట్రాలలో అనేక గిరిజన ప్రాంతాలు ఉన్నాయి. నక్సలైట్లు ఈ పేద గిరిజనులను తీవ్రవాదులుగా మార్చారు, కానీ వారికి రోడ్లు , తాగునీటి సౌకర్యాలు కల్పించడానికి ఎప్పుడూ సహాయం చేయలేదు, కానీ ఉప ముఖ్య‌మంత్రి పవన్ కళ్యాణ్ ప్రజాస్వామ్య పద్ధతిలో దీనిని సాధ్యం చేశారు. అందుకే, ఆంధ్రప్రదేశ్ ఉత్తర తూర్పు ప్రాంత గిరిజనులు తమ నిజమైన నాయకుడికి ఈ సన్మానం చేస్తున్నారు. ఇచ్చిన మాట ప్ర‌కారం రోడ్డును ఏర్పాటు చేయ‌డంతో సంతోషంతో ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు పాలాభిషేకం చేశారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *