స్మార్ట్ కిచెన్ ప్రాజెక్టు దేశానికే మోడల్ : సీఎం

Spread the love

క‌డ‌ప జిల్లా క‌లెక్ట‌ర్ చెరుకూరి శ్రీ‌ధ‌ర్ కు కంగ్రాట్స్

అమ‌రావ‌తి : క‌డ‌ప జిల్లా క‌లెక్ట‌ర్ చెరుకూరి శ్రీ‌ధ‌ర్ ను ప్ర‌త్యేకంగా అభినంద‌న‌ల‌తో ముంచెత్తారు ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు . గురువారం అమ‌రావ‌తి స‌చివాల‌యంలో జ‌రిగిన జిల్లాల క‌లెక్ట‌ర్ల స‌ద‌స్సులో ఆయ‌న పాల్గొని ప్ర‌సంగించారు. స్మార్ట్ కిచెన్ విధానం గురించి వివ‌రించారు క‌ల‌క్ట‌ర్.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ కడప జిల్లాలో చేపట్టిన స్మార్ట్ కిచెన్ ప్రాజెక్టు దేశానికే మోడల్ గా మారిందన్నారు. స్మార్ట్ కిచెన్, స్మార్ట్ హెల్త్ , స్మార్ట్ చిల్డ్ర‌న్ అన్నట్టుగా ఈ విధానాన్ని తీర్చిదిద్దాలని ఆదేశించారు. అన్ని జిల్లాల కలెక్టర్లు కడప స్మార్ట్ కిచెన్లను సందర్శించాలని సూచించారు నారా చంద్ర‌బాబు నాయుడు. స్మార్ట్ కిచెన్ ద్వారా తాజా, రుచికరమైన ఆహారం అందించటం, న్యూట్రిషనిస్టుల సహాకారం తీసుకోవటం మంచి ఆలోచన అని ప్ర‌శంసించారు.

నాచురల్ ఫార్మింగ్ ను కూడా దీనికి ఇంటిగ్రేషన్ చేయటం చాలా బాగుందన్నారు సీఎం. స్మార్ట్ కిచెన్ కు సర్టిఫికేషన్ కూడా తీసుకోవటం అభినందనీయం అని అన్నారు . టీటీడీ తరహాలోనే తనిఖీ వ్యవస్థ ఉండాలని స్ప‌ష్టం చేశారు నారా చంద్ర‌బాబు నాయుడు. రైతు బజార్లలోనూ నాచురల్ ఫార్మింగ్ ఉత్పత్తులు రావాలి. సర్టిఫికేషన్ తో పాటు డోర్ డెలివరీ వచ్చేలా ఉండాలన్నారు. స్మార్ట్ కిచెన్ల ద్వారా అంగన్ వాడీలు, సంక్షేమ హాస్టళ్లు, రెసిడెన్షియల్ పాఠశాలలకూ ఆహారం అందించాలని సూచించారు. కడపలోని అన్ని స్కూళ్లల్లో చిన్నారులకు, విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించాల‌ని స్ప‌ష్టం చేశారు.

  • Related Posts

    ప్రోటోకాల్ వివాదం చంద్ర‌బాబు ఆగ్ర‌హం

    Spread the love

    Spread the loveమాజీ ఎమ్మెల్యే వ‌ర్మ తీరుపై సీఎం సీరియ‌స్ అమ‌రావ‌తి : రాష్ట్రంలో కూట‌మి నేత‌ల మ‌ధ్య ప్రోటోకాల్, ఆధిప‌త్య పోరు కొన‌సాగుతూనే ఉంది. ఆయా పార్టీల అధినేత‌లు స‌ర్ది చెప్పేందుకు ప్ర‌య‌త్నం చేసినా అక్క‌డ‌క్క‌డా వివాదాలు చోటు చేసుకుంటూనే…

    ఆర్టీసీ కార్మికుల‌కు ఎండీ స్ట్రాంగ్ వార్నింగ్

    Spread the love

    Spread the loveస‌మ్మె విర‌మించ‌క పోతే చ‌ర్య‌లు త‌ప్ప‌వు హైద‌రాబాద్ : ఆర్టీసీ ఉద్యోగుల స‌మ్మె నేప‌థ్యంలో తీవ్రంగా స్పందించారు సంస్థ ఎండీ వై. నాగిరెడ్డి. ఆయ‌న కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. స‌మ్మె చ‌ట్ట విరుద్ద‌మ‌న్నారు. ఇలాగే స‌మ్మెను కొన‌సాగిస్తే స‌మ్మెలో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *