ఆదిత్యా ధ‌ర్ అద్బుతం ధురంధ‌ర్ క‌ళాఖండం

Spread the love

ప్ర‌శంస‌లు కురిపించిన న‌టి ప్రీతి జింతా

అమెరికా : ప్ర‌ముఖ వ‌ర్ద‌మాన బాలీవుడ్ న‌టి, ఐపీఎల్ ఫ్రాంచైజీ పంజాబ్ కింగ్స్ ఎలెవ‌న్ జ‌ట్టు య‌జ‌మానురాలు ప్రీతి జింతా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. తాను అనుకోకుండా ఆదిత్య ధ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ధురంధ‌ర్ మూవీని థియేట‌ర్ లో చూశాన‌ని అన్నారు. ఒక‌టా రెండా ఏకంగా మూడున్న‌ర గంట‌ల పాటు తీసిన ఈ సినిమా గురించి ఎంత చెప్పినా త‌క్కువేన‌ని పేర్కొన్నారు ప్రీతి జింతా. త‌న జీవితంలో ఇలాంటి సినిమాను చూస్తాన‌ని అనుకోలేద‌ని అన్నారు న‌టి. ఇలా ఇన్ని గంట‌లు ఎలా చూడాల‌ని అనుకుంటున్న త‌రుణంలోనే సినిమా పూర్త‌యి పోయింద‌ని , తానే ఆశ్చ‌ర్యానికి లోనైన‌ట్లు తెలిపింది ప్రీతి జింతా.

మ‌రోసారి ధురంధ‌ర్ సినిమాను చూడాల‌ని అనుకుంటున్న‌ట్లు చెప్పారు. గురువారం సామాజిక మాధ్య‌మాలు ఇన్ స్టా, ఫేస్ బుక్, ట్విట్ట‌ర్, లింక్డ్ ఇన్ వేదికగా పంచుకుంది న‌టి. ఆదిత్య ధర్ సినిమాను క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లు చూపించాడు. ఎలా చెప్పాలో నాకు మాటలు రావడం లేదు. ఇప్ప‌టికిప్పుడు త‌న‌కు ఫోన్ చేయాల‌ని ఉంద‌ని పేర్కొంది ప్రీతి జింతా. నాకెలా అనిపించిందో, ఈ కళాఖండాన్ని నేను ఎంతగా ప్రేమించానో చెబుతానని తెలిపింది. అప్పటి వరకు నేను చెప్పేదొక్కటే, దీన్ని అస్సలు మిస్ అవ్వకండి మిత్రులారా! వెళ్లి చూడాల‌ని కోరింది. ఈ కళాఖండాన్ని సజీవంగా తీసుకు వచ్చిన నటీనటులు, సాంకేతిక నిపుణుల బృందానికి అభినంద‌న‌లు తెలిపారు న‌టి.

  • Related Posts

    సినిమా అంటే వినోదం కాదు ప్ర‌జా ఉద్య‌మం

    Spread the love

    Spread the loveకీల‌క వ్యాఖ్య‌లు చేసిన దాసోజు శ్ర‌వ‌ణ్ కుమార్ హైద‌రాబాద్ : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డాక్ట‌ర్ దాసోజు శ్ర‌వ‌ణ్ కుమార్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో నిర్మించిన “జై బోలో తెలంగాణ” సినిమాలో తాను ఐపీఎస్ ఆఫీసర్…

    మార్కులు..ర్యాంకులు మాత్ర‌మే కొల‌మానం కాదు

    Spread the love

    Spread the loveద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు విశాఖ‌ప‌ట్నం : జీవితంలో పైకి ఎద‌గాలంటే చ‌దువు ఒక్క‌టే మార్గ‌మ‌ని అన్నారు. కూలీ కొడుకైనా వ్యాపార‌స్తుడి కొడుకైనా గుర్తింపు రావాలంటే చ‌దువు కోవాల్సిందేన‌ని చెప్పారు. విశాఖ‌లోని ఏయూ స్నాత‌కోత్స‌వ కార్య‌క్ర‌మానికి ఆయ‌న…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *