ద‌ర్శ‌న్ క‌న్న‌డ పాలిటిక్స్ లోకి వ‌స్తే బెట‌ర్

బెంగ‌ళూరు : తమిళనాడులో విజయ్ లాగే కర్ణాటకలో దర్శన్ ఉంటారంటూ బాంబు పేల్చారు న‌టి అశ్విని గౌడ . ఇవాళ ప్రాంతీయ మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్న నటుడు సి. జోసెఫ్ విజయ్ బాటలో కన్నడ చిత్ర పరిశ్రమ నుండి ఎవరు నడవగలరని అడిగినప్పుడు ఆస‌క్తిక‌ర స‌మ‌ధానం ఇచ్చారు. అశ్విని గౌడ దర్శన్ పేరును సరైన ఎంపికగా పేర్కొన్నారు. బిగ్ బాస్ కన్నడ 12 కంటెస్టెంట్ గా ఉన్నారు. నటుడు దర్శన్ రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకుంటే అది మంచి ఎంపిక అవుతుందని అన్నారు. సినిమా , రాజకీయాలు వేర్వేరు. చిత్ర పరిశ్రమకు చెందిన వారికి ఆసక్తి ఉండి, రాజకీయాల్లోకి రావడానికి మిగిలినవన్నీ వదులు కోవడానికి సిద్ధంగా ఉంటే, వారు అలా చేయాలని త‌న అభిప్రాయం వ్య‌క్తం చేశారు అశ్విని గౌడ‌. దర్శన్ రాజకీయాల్లోకి వస్తే మంచి ఎంపిక అవుతారని నేను భావిస్తున్నాను. ఆయనకు శుభాకాంక్షలు అంటూ పేర్కొన్నారు.

కర్ణాటక భూమి, భాష , సంస్కృతిని రక్షించడానికి తమ జీవితాలను అంకితం చేసిన నాయకులలో కన్నడ ఉద్యమకారుడు టి. నారాయణ గౌడ ఒకరని అశ్విని ప్రశంసించారు. 2028 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచన ఉందా అని అడిగినప్పుడు, అటువంటి నిర్ణయం తీసుకోవడానికి ఇంకా చాలా సమయం ఉందని ఆమె అన్నారు. నేను రాజకీయ పార్టీలో చేరుతానా, ఏ పార్టీని ఎంచుకుంటానా అని ప్రజలు తరచుగా అడుగుతుంటారు. ప్రతిదానికీ ఒక సమయం ఉంటుంది. ఒకవేళ నాకు అవకాశం వస్తే, అప్పుడు నిర్ణయం తీసుకుంటాను అని ఆమె చెప్పారు. బిగ్ బాస్ కన్నడ 12లో తన తోటి కంటెస్టెంట్ అయిన గిల్లి గురించి కూడా ఆమె మాట్లాడారు; షోలో వారి మధ్య పోటీ ఉన్నప్పటికీ, వ్యక్తిగతంగా ఎలాంటి ద్వేషం లేదని ఆమె పేర్కొన్నారు.

  • Related Posts

    త‌మిళ‌నాడు సీఎం విజ‌య్ ను ప్ర‌శంసించిన అట్లీ

    చెన్నై : తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్‌ను ప్రశంసించాడు డైన‌మిక్ డైరెక్ట‌ర్ అట్లీ కుమార్. ఆయ‌న విజయ్ సేతుపతిపై పరోక్ష విమర్శలు చేశాడు. విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో నటించిన ‘బత్తా’ (Baththa) చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో అట్లీ మాట్లాడారు.…

    విజయ్ రాఘవేంద్ర హీరోగా సంజీవ్ మేగోటి మూవీ

    హైదరాబాద్: క్రైమ్, యాక్షన్, థ్రిల్‌తో కూడిన విభిన్న కథలను తెరపై ఆవిష్కరించడంలో తనదైన ముద్ర వేసుకున్న క్రియేటివ్ డైరెక్టర్ సంజీవ్ మేగోటి మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. తెలుగులో వరలక్ష్మి శరత్‌కుమార్, నవీన్ చంద్ర ప్రధాన పాత్రల్లో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *