మెటా ఇండియా ఎఫెక్ట్ ..డీజీపీ ఆఫీస్ కు డీసీపీ అటాచ్

హైద‌రాబాద్ : దేశ వ్యాప్తంగా క‌ల‌క‌లం రేపింది మెటా ఇండియా హెడ్ పై హైద‌రాబాద్ పోలీసులు కేసు న‌మోదు చేయ‌డం. మెటా ఇండియా అధిపతిపై నమోదైన కేసులో నగర సైబర్ క్రైమ్ డీసీపీ కోసం గాలింపు ప్రారంభం అయ్యింది. ప్ర‌ధాన మంత్రి నరేంద్ర మోదీ, ధర్మేంద్ర ప్రధాన్‌లను కించ పరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారంటూ తెలంగాణ బీజేపీ నాయకులు ఫిర్యాదు చేశారు ఈ మేర‌కు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేయ‌డం క‌ల‌క‌లం రేపింది. ఈ కేసులో మెటా అధిపతిని కూడా నిందితుడిగా చేర్చారు పోలీసులు.

ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో కొందరు పెట్టిన పోస్టులకు మెటా ఎలా బాధ్యత వహిస్తుందనే విషయంపై దేశ వ్యాప్తంగా వివాదం చెల‌రేగింది. సైబర్ క్రైమ్ డీసీపీ అరవింద్ బాబుపై ప్రభుత్వం విచారణ ప్రారంభించింది. ఈ మేర‌కు అరవింద్ బాబును డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి రావడంతో, అరవింద్ బాబు డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేశారు.

  • Related Posts

    80 శాతం సబ్సిడీతో1.31 లక్షల క్వింటాళ్ల విత్తనాలు

    అమ‌రావ‌తి : ఏపీ కూట‌మి ప్ర‌భుత్వం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. రాష్ట్రంలో రైతుల పంట‌ల సాగుకు సంబంధించి 80 శాతం స‌బ్సిడీతో 1.31 ల‌క్ష‌ల క్వింటాళ్ల విత్త‌నాల‌ను స‌ర‌ఫ‌రా చేశామ‌ని తెలిపింది. ఖరీఫ్ కంటింజెన్సీ ప్రణాళిక కోసం రూ. 60 కోట్లు…

    వ‌రంగ‌ల్ ఎయిర్ పోర్టుకు ‘సమ్మక్క-సారలమ్మ’ పేరు పెట్టండి

    హైద‌రాబాద్ : ధ‌ర్మ స‌మాజ్ వాది పార్టీ అధ్య‌క్షుడు డాక్టర్ విషార‌ద‌న్ మ‌హారాజ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆదివారం ఆయ‌న సోష‌ల్ మీడియా ఎక్స్ వేదిక‌గా స్పందించారు. ప్ర‌స్తుతం ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు వంగా సందీప్ రెడ్డి వరంగ‌ల్ ఎయిర్ పోర్టుకు రుద్ర‌మ‌దేవి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *