రోడ్డు వేసినందుకు గిరిజనుల ఆనందం
అమరావతి : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొణిదల ఇచ్చిన మాట నిలబబెట్టుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. పాలనా పరంగా ఆయన దూకుడు పెంచారు. ప్రతి వారం ప్రజా దర్బార్ నిర్వహించేలా తమ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులకు దిశా నిర్దేశం చేశారు. ఈ మేరకు డిప్యూటీ సీఎం ఆదేశాల మేరకు జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ కొణిదల నాగబాబు ఆధ్వర్యంలో ప్రజలతో ఆర్జీలను స్వీకరిస్తున్నారు. ఇదే సమయంలో ఆయా శాసన సభ నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలు, లోక్ సభ నియోజకవర్గాలలో ఎంపీలు సైతం ప్రజా దర్బార్ చేపడుతున్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ తన పర్యటనలో భాగంగా ఉప్పాడ తీర ప్రాంతంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు యాక్షన్ ప్లాన్ తయారు చేయించారు.
ఈ మేరకు మత్స్యకారులకు ఉపాధి , శిక్షణ కల్పించేలా చర్యలు చేపట్టారు. ఇప్పటికే తమిళనాడు, కేరళ, తదితర ప్రాంతాలలో వారికి మెరుగైన ట్రైనింగ్ ఇస్తున్నారు. ఇదే సమయంలో భారతదేశంలో బీహార్, ఛత్తీస్‌గఢ్, పశ్చిమ బెంగాల్, ఒరిస్సా, అస్సాం మొదలైన రాష్ట్రాలలో అనేక గిరిజన ప్రాంతాలు ఉన్నాయి. నక్సలైట్లు ఈ పేద గిరిజనులను తీవ్రవాదులుగా మార్చారు, కానీ వారికి రోడ్లు , తాగునీటి సౌకర్యాలు కల్పించడానికి ఎప్పుడూ సహాయం చేయలేదు, కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రజాస్వామ్య పద్ధతిలో దీనిని సాధ్యం చేశారు. అందుకే, ఆంధ్రప్రదేశ్ ఉత్తర తూర్పు ప్రాంత గిరిజనులు తమ నిజమైన నాయకుడికి ఈ సన్మానం చేస్తున్నారు. ఇచ్చిన మాట ప్రకారం రోడ్డును ఏర్పాటు చేయడంతో సంతోషంతో పవన్ కళ్యాణ్ కు పాలాభిషేకం చేశారు.





