టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ జ‌ట్టు డిక్లేర్ : బీసీసీఐ

Spread the love

శుభ్ మ‌న్ గిల్ కు బిగ్ షాక్ , శాంస‌న్ కు చోటు

ముంబై : భార‌త్, శ్రీ‌లంక సంయుక్తంగా నిర్వ‌హించే టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో పాల్గొనే భార‌త జ‌ట్టును ప్ర‌క‌టించింది బీసీసీఐ. శ‌నివారం 15 మంది స‌భ్యుల‌తో కూడిన జ‌ట్టును ప్ర‌క‌టించారు బీసీసీఐ సెలెక్ష‌న్ క‌మిటీ చైర్మ‌న్ అజిత్ అగార్క‌ర్. ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో గ‌త కొంత కాలంగా ఆడుతూ వ‌స్తున్న శుభ్ మ‌న్ గిల్ ను ప‌క్క‌న పెట్టడం విస్తు పోయేలా చేసింది. కొత్త‌గా కేర‌ళ స్టార్ హీరో సంజూ శాంస‌న్ , రింకూ సింగ్, ఇషాన్ కిష‌న్ ల‌ను ఎంపిక చేసిన‌ట్లు తెలిపాడు అగార్క‌ర్. ఎందుకు గిల్ ను తొల‌గించార‌ని ప్ర‌శ్నించ‌గా త‌ను ఇటీవ‌ల ప‌రుగులు ఆశించిన మేర చేయ‌లేక పోతున్నాడ‌ని అందుకే తొల‌గించాల్సి వ‌చ్చింద‌ని చెప్పాడు. ఇదే స‌మ‌యంలో శాంస‌న్ , అభిషేక్ శ‌ర్మ‌లు క‌లిసి ఓపెనింగ్ చేస్తార‌ని ప్ర‌క‌టించాడు. ఇదే జ‌ట్టు న్యూజిలాండ్ తో పాటు వ‌ర‌ల్డ్ క‌ప్ లో ఆడుతుంద‌ని ప్ర‌క‌టించాడు అగార్క‌ర్.

ఇదిలా ఉండ‌గా గ‌త కొంత కాలంగా జ‌ట్టుకు దూరంగా పెట్టిన రింకూ , కిష‌న్ ల‌కు ఛాన్స్ ఇవ్వ‌డం ప‌ట్ల స‌ర్వ‌త్రా హ‌ర్షం వ్య‌క్తం అవుతోంది. ఇదే క్ర‌మంలో జితేష్ శ‌ర్మ స్థానంలో కిష‌న్ ప‌నికి వ‌స్తాడ‌ని రెండో వికెట్ కీప‌ర్ గా ప‌నికి వ‌స్తాడ‌ని ఎంపిక చేశామ‌న్నాడు. ఇక రింకూను ఫినిష‌ర్ గా ఉంటాడ‌ని తీసుకున్నామ‌న్నాడు. ఇక జ‌ట్టు ప‌రంగా చూస్తే సూర్య కుమార్ యాదవ్ (కెప్టెన్), అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకు సింగ్, జస్ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, వాషింగ్టన్ సుందర్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్).

  • Related Posts

    టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ జ‌ట్టులో శుభ్ మ‌న్ గిల్ కు నో ఛాన్స్

    Spread the love

    Spread the loveకోలుకోలేని షాక్ ఇచ్చిన బీసీసీఐ సెలెక్షన్ క‌మిటీ చైర్మ‌న్ ముంబై : బీసీసీఐ సెలెక్ష‌న్ క‌మిటీ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. తాజాగా వ‌చ్చే ఏడాది 2026లో భార‌త్, శ్రీ‌లంక సంయుక్తంగా నిర్వ‌హించ‌బోయే టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో పాల్గొనే…

    ఆడ‌క పోయినా స‌రే వారికే అందలం

    Spread the love

    Spread the loveరేపే టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ జ‌ట్టు ఎంపిక ముంబై : భార‌త్ , శ్రీ‌లంక సంయుక్తంగా నిర్వ‌హిస్తోంది ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్. వ‌చ్చే ఏడాదిలో జ‌రిగే ఈ మెగా టోర్నీ కోసం ఇప్ప‌టికే ఆయా జ‌ట్ల‌ను ప్ర‌క‌టించాయి.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *