సాయిబాబపై అనుచిత వ్యాఖ్యలు
హైదరాబాద్ : సినీ నటి, బీజేపీ అనుకూల కామెంట్స్ చేస్తూ రీల్స్, వీడియోల పై ఫోకస్ పెట్టింది మాధవీలత. తను తాజాగా సంచలన వ్యాఖ్యలు చేసింది షిర్డీ సాయిబాబా గురించి. చివరకు ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. భక్తుల మనో భావాలు దెబ్బతిన్నాయి. సాయి బాబా దేవుడు కానే కాదని పేర్కొంది. తనను ఎందుకు కొలుస్తున్నారంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. దీంతో సోషల్ మీడియాతో తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ నటి మాధవీలతపై సాయి బాబా సంస్థాన్ ఫిర్యాదు చేసింది.
ఆమెతో పాటు మరికొందరు యూట్యూబర్లపై కూడా ఫిర్యాదు చేయడంతో హైదరాబద్ లోని సరూర్ నగర్ పోలీసులు షాక్ ఇచ్చారు. వీరందరిపై కేసు నమోదు చేశారు. ఈ సందర్బంగా డిసెంబర్ 30వ తేదీ మంగళవారం రోజు తమ ముందు విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. ఈ మేరకు నోటీసులు జారీ చేశారు. విచారణ నిమిత్తం సరూర్ పోలీస్ స్టేషన్ కు ఉదయం 10 గంటలకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ఈ మధ్యన ఫ్యాషన్ అయి పోయింది. ప్రతి ఒక్కరికీ కామెంట్స్ చేయడం, పాపులర్ కావడం, ఇతరులను ఇబ్బంది పెట్టడం.






