అఖండ‌-2 చిత్రం అద్భుతం : బండి సంజ‌య్
ద‌ర్శ‌కుడిలో శివుడు ఆవ‌హించాడ‌ని కితాబు

హైద‌రాబాద్ : కేంద్ర హోం శాఖ స‌హాయ మంత్రి బండి సంజ‌య్ కుమార్ ప‌టేల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న తాజాగా నందమూరి బాల‌కృష్ణ న‌టించిన బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌క‌త్వం వహించిన అఖండ -2 చిత్రం గురించి ఆకాశానికి ఎత్తేశారు. ఇలాంటి సినిమాను తాను ఇప్ప‌టి వ‌ర‌కు చూడ‌లేద‌న్నాడు. ఓహో ఆహా అంటూ ప్ర‌శంస‌లు కురిపించాడు. అఖండ-2 సినిమా చూడకుండా.. ఇన్ని రోజులు నా జీవితాన్ని వృధా చేసుకున్నాన‌ని వాపోయాడు.

మిగిలిన జీవితం ధర్మానికి అర్పించాలని నిర్ణ‌యం తీసుకున్నాన‌ని చెప్పారు బండి సంజ‌య్ కుమార్ ప‌టేల్. ఈ సినిమా నాకు ఆలోచన కలిగించిందన్నార‌. ఇప్పుడు బాలకృష్ణ సినిమాలు కాలేజ్ స్టూడెంట్స్ బెట్టింగ్ వేసుకొని మరీ చూస్తున్నారంటూ చెప్పారు. అల‌నాటి సీనియర్ ఎన్టీఆర్ ని మైమరిపించేలా బాలకృష్ణ యాక్టింగ్ చేస్తున్నాడంటూ కితాబు ఇచ్చారు. బాలకృష్ణలో సీనియర్ ఎన్టీఆర్ ని చూసుకుంటున్నామ‌ని చెప్పారు .

అఖండ 2 సినిమాలో బాలకృష్ణను చూస్తే పరమేశ్వరుడే ప్రత్యక్షం అయ్యాడని అనిపించింద‌న్నారు. అంతే కాదు సాక్షాత్తు ఆ ఈశ్వ‌రుడే బోయపాటి శ్రీనులో ఆవహించి అఖండ సినిమా తీయించి ఉంటాడని పేర్కొన్నారు బండి సంజ‌య్ కుమార్ ప‌టేల్.

  • Related Posts

    వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ వాయిదా

    హైద‌రాబాద్ : అంద‌రూ అనుకున్న‌ట్లే విక్ట‌రీ వెంక‌టేష్ కీ రోల్ పోషించిన త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఆద‌ర్శ కుటుంబం వాయిదా ప‌డింది. ఈ విష‌యాన్ని సోష‌ల్ మీడియా వేదిక‌గా సోమ‌వారం ప్ర‌క‌టించారు నిర్మాత నాగ‌వంశీ. వాస్తవానికి అక్టోబ‌ర్ 9వ తేదీన…

    ర‌ష్మిక మంద‌న్నా..దేవుడిచ్చిన వ‌రం : దేవ‌ర‌కొండ

    హైద‌రాబాద్ : యువ క‌థానాయ‌కుడు విజ‌య్ దేవ‌ర‌కొండ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. త‌ను త‌న భార్య‌, నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్నాతో క‌లిసి రాహుల్ సాంకృత్య‌న్ ద‌ర్శ‌క‌త్వంలో చారిత్రాత్మ‌క‌మైన ర‌ణ‌బాలి మూవీలో క‌లిసి న‌టిస్తున్నారు. గ‌తంలో ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ ఇద్ద‌రూ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *