ప్రకటించిన సెలెక్షన్ కమిటీ చైర్మన్
ముంబై : దేశీవాళి టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ కోసం జరుగుతున్న మ్యాచ్ లలో ఉన్నట్టుండి ముంబై జట్టుకు కెప్టెన్ గా ఉన్న శార్దూల్ ఠాకూర్ కు గాయం అయ్యింది. దీంతో తను కొన్ని మ్యాచ్ లకు దూరంగా ఉండనున్నాడు. పలువురు కీలక ఆటగాళ్లు ముంబై టీమ్ లో ఉన్నప్పటికీ ఉన్నట్టుండి సంచలన నిర్ణయం తీసుకున్నారు ముంబై సెలెక్షన్ కమిటీ చైర్మన్ సంజయ్ పాటిల్. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. హార్దిక్ పాండ్యా, బుమ్రా, యశస్వి జైశ్వాల్ లాంటి ప్రధాన కీలక ఆటగాళ్లు ఉన్నా కూడా ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ ఎలెవన్ జట్టును విజయ పథంలో నడిపించిన నాయకుడిగా గుర్తింపు పొందిన శ్రేయాస్ అయ్యర్ కు నాయకత్వ పగ్గాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పారు.
ఇదిలా ఉండగా గత ఏడాది భారత్ ఆస్ట్రేలియా లో పర్యటించిన సమయంలో ఉన్నట్టుండి మైదానంలో గాయపడ్డాడు శ్రేయాస్ అయ్యారు. ఆ తర్వాత అన్ని పార్మాట్ లకు దూరంగా ఉన్నాడు. దీంతో ఆరోగ్య పరంగా ఫిట్ గా ఓకే అయితేనే తనను ఎంపిక చేస్తామని ఇప్పటికే బీసీసీఐ క్లియర్ ప్రకటన చేసింది. బెంగళూరు లోని క్రికెట్ అకాడమీలో తను పరీక్షకు హాజరయ్యాడు. అందులో ఓకే అని తేలడంతో తన ఎంపికకు లైన్ క్లియర్ అయ్యింది. ఈ సందర్భంగా అయ్యర్ ను బీసీసీఐ సెలెక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్ సంచలన ప్రకటన చేశాడు. న్యూజిలాండ్ తో జరిగే వన్డే సీరీస్ కు ఎంపిక చేశాడు.








