స్పష్టం చేసిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
అమరావతి : ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాకినాడలో పేరు పొందిన రంగరాయ మెడికల్ కాలేజీని సందర్శించారు. రోగులకు అందిస్తున్న సేవల గురించి ఆరా తీశారు. ఈ వైద్య కళాశాల కాకినాడకు గర్వ కారణం అని పేర్కొన్నారు. నెలలో ఒక రోజు గ్రామాల్లో , గిరిజన ప్రాంతాల్లో సేవలు అందించాలని స్పష్టం చేశారు. పేద ప్రజలకు చికిత్స అందించాలని, సమాజానికి అండగా నిలవాలని పిలుపునిచ్చారు కొణిదల పవన్ కళ్యాణ్. ఈ మెడికల్ కాలేజీ ఎంతో మంది వైద్యులను రాష్ట్రానికి అందించిందని చెప్పారు. పూర్వ విద్యార్థుల (రాంకోసా) ఆర్థిక సాయంతో నూతన భవనాన్ని నిర్మించడం ఆనందంగా ఉందన్నారు .
భవిష్యత్తులో మరింతగా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. కోట్లాది రూపాయల కంటే కష్ట కాలంలో ఆదుకోవడం అత్యంత ముఖ్యమని అన్నారు పవన్ కళ్యాణ్. మానవ సేవ కంటే మాధవ సేవే గొప్పదన్నారు. గత ప్రభుత్వం విద్య, వైద్య రంగాలను కావాలని నిర్వీర్యం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు . కానీ తాము అధికారంలోకి వచ్చాక విద్య, వైద్య రంగాలకు ప్రయారిటీ ఇస్తూ వచచ్చామని, ప్రస్తుతం పీపీపీ పద్దతిన మెడికల్ కాలేజీలను అభివృద్ది చేస్తామన్నారు పవన్ కళ్యాణ్ కొణిదల.






