తెలంగాణ సర్కార్ పై భగ్గుమన్న మాజీ మంత్రి
పాలమూరు జిల్లా : మాజీ మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. ఆయన పాలమూరు జిల్లాలో పర్యటించారు. ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో తమ ప్రభుత్వం పాలనా పరంగా కీలకమైన నిర్ణయాలు తీసుకుందన్నారు. దీనిని ఆనాడు ప్రజలు స్వాగతించారని చెప్పారు. కేవలం పాలనా పరంగా ప్రజలకు మేలు చేకూర్చేందుకు తమ నాయకుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. ఇదిలా ఉండగా కాంగ్రెస్ సర్కార్ ప్రస్తుతం మహబూబ్ నగర్ జిల్లాను 5 జిల్లాలుగా చేసి కేసీఆర్ తప్పు చేశాడని ఆరోపణలు చేయడం దారుణమన్నారు కేటీఆర్. ఇది మంచి పదద్తి కాదన్నారు.
వనపర్తి, నారాయణపేట, గద్వాల్ జిల్లాలు రద్దు చేస్తామని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పడం పట్ల తీవ్రస్తాయిలో మండిపడ్డారు కేటీఆర్. ఇలా తీసేస్తే ఆయా జిల్లాల ప్రజలు ఊరుకుంటారా ఉరికించి కొడతారని సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి. మీరు గనుక ఆ జిల్లాలు ముట్టుకుంటే అక్కడ అగ్గి పుట్టించే బాధ్యత బీఆర్ఎస్ తీసుకుంటదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇకనైనా సర్కార్ ముందు వెనుకా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని హితవు పలికారు. లేక పోతే ప్రజా ఆగ్రహానికి గురి కాక తప్పదని అన్నారు కేటీఆర్.






