చంద్ర‌బాబు క‌నుస‌న్న‌ల‌లో రేవంత్ పాల‌న

Spread the love

నిప్పులు చెరిగిన మాజీ మంత్రి హ‌రీశ్ రావు

హైద‌రాబాద్ : మాజీ మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావు నిప్పులు చెరిగారు. ఆయ‌న సీఎం రేవంత్ రెడ్డిపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. గురువు నారా చంద్ర‌బాబు నాయుడు చెప్పిన‌ట్లే సీఎం పాల‌న సాగిస్తున్నాడ‌ని ఆర‌పించారు. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నాడు. బాబు హ‌యాంలోనే తెలంగాణ తీర‌ని అన్యాయానికి గురైంద‌ని ఆ విష‌యం ప్ర‌జ‌లంద‌రికీ తెలుస‌న్నారు. అందుకే ఇక్క‌డ టీడీపీని అడ్ర‌స్ లేకుండా చేశార‌ని అన్నారు. ఈ విష‌యం తెలిసే మెల్ల‌గా త‌న శిష్యుడు రేవంత్ రెడ్డి ద్వారా లోపాయికారీగా పాల‌న సాగిస్తున్నాడ‌ని ధ్వ‌జ‌మెత్తారు. మంగ‌ళ‌వారం హ‌రీశ్ రావు మీడియాతో మాట్లాడారు. ఇవాళ తెలంగాణ ప్రాంత ప్ర‌యోజ‌నాల‌కు భంగం క‌లిగించేలా నిర్ణ‌యాలు తీసుకుంటున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు .

ఏదో ఒక రోజు ప్ర‌జ‌లు తిర‌గ‌బ‌డ‌టం ఖాయ‌మ‌ని హెచ్చ‌రించారు. ఇక‌నైనా రేవంత్ రెడ్డి త‌న ప‌నితీరు మార్చుకోవాల‌ని సూచించారు. నాడు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో రైతులతో రిట్ వేయించి మరీ ఏపీ ప్రభుత్వం ప్రాజెక్టుకు స్టే సాధిస్తే, ఇక్కడి చేతగాని కాంగ్రెస్ సర్కారు మాత్రం ఉద్దేశ పూర్వకంగానే విచారణ అర్హత లేని పిటిషన్ వేసి తెలంగాణకు తీరని అన్యాయం చేసింద‌ని ఆరోపించారు హ‌రీశ్ రావు. ఈ మాత్రం దానికి ఉత్తమ్ కుమార్ సూటు బూటు వేసుకొని ఢిల్లీ దాకా పోవాల్సిన అవసరం ఉందా అని ప్ర‌శ్నించారు. ప్ర‌భుత్వ ఖ‌జానాకు గండి ప‌డింద‌న్నారు. సివిల్ సూట్ ఫైల్ చేస్తామని తెలంగాణ ప్రభుత్వం చెప్పడం అంటే, పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టు కట్టుకోవడానికి ఏపీకి ప‌ర్మిష‌న్ ఇవ్వ‌డం త‌ప్ప మ‌రోటి కాద‌న్నారు హ‌రీశ్ రావు.

  • Related Posts

    తాజా ఎన్నిక‌ల్లో ఇండియా కూట‌మిదే విజ‌యం

    Spread the love

    Spread the loveధీమా వ్య‌క్తం చేసిన డిప్యూటీ సీఎం డీకే శివ‌కుమార్ బెంగ‌ళూరు : క‌ర్ణాట‌క ఉప ముఖ్య‌మంత్రి డీకే శివ‌కుమార్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న ఇండియా కూట‌మి త‌ర‌పున పెద్ద ఎత్తున ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొన్నారు. ఇండియా కూట‌మిలోని…

    ఏపీ సీఎంతో బిట్స్ పిలానీ ప్ర‌తినిధులు భేటీ

    Spread the love

    Spread the loveరూ. 200 కోట్ల‌తో అమ‌రావ‌తిలో క్యాంప‌స్ నిర్మాణం అమ‌రావ‌తి : భార‌త దేశంలో విద్యా ప‌రంగా నెంబ‌ర్ వ‌న్ స్థానంలో ఉంది బిట్స్ పిలానీ క్యాంప‌స్, యూనివ‌ర్శిటీ. ఈ సంద‌ర్బంగా ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి వేదిక‌గా బిట్స్ పిలానీ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *