ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కలెక్టర్ పమెలా సత్పతి
కరీంనగర్ జిల్లా : మానవ జీవితంలో పండుగలు అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తాయని అన్నారు కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమెలా సత్ఫతి . తన క్యాంపు కార్యాలయంలో సంక్రాంతి పండుగను ఘనంగా ,సాంప్రదాయ బద్ధంగా నిర్వహించారు. గ్రామీణ సంస్కృతికి, ప్రాచీన సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఈ వేడుకలను ఎంతో ఉత్సాహంగా నిర్వహించడం విశేషం.
ఈ సందర్భంగా కార్యాలయాన్ని రంగు రంగుల రంగవల్లులతో అందంగా అలంకరించారు. ఉద్యోగులు ఉత్సాహ భరితమైన పండుగ వాతావరణంలో వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ పామెలా సత్పతి మాట్లాడారు. సంక్రాంతి పండుగ మన గొప్ప సంస్కృతి, సంప్రదాయాలను గుర్తు చేసే ఒక ముఖ్యమైన పండుగ అని అన్నారు. ఈ పండుగ వ్యవసాయం, ప్రకృతి, కుటుంబ బంధాల ప్రాముఖ్యతను ప్రతిబింబిస్తుందని ఆమె పేర్కొన్నారు.
కలెక్టర్ అధికారులు, సిబ్బందితో ఆత్మీయంగా ముచ్చటించారు. వారికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఇటువంటి వేడుకలు ఉద్యోగుల మధ్య ఐక్యతను పెంపొందించి, సానుకూల వాతావరణాన్ని నెలకొల్పేలా చేస్తుందన్నారు కలెక్టర్. ఈ వేడుకలను ఘనంగా నిర్వహించినందుకు ప్రతి ఒక్కరినీ అభినందలతో ముంచెత్తారు. కార్యాలయ అధికారులు, సిబ్బంది సంక్రాంతి వేడుకల్లో చురుకుగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని చిరస్మరణీయంగా మార్చారు.





