అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అన్ని స్థానాల్లో టీవీకే పోటీ

సంచ‌ల‌న ప్ర‌క‌ట చేసిన పార్టీ చీఫ్ విజ‌య్

చెన్నై : ప్ర‌ముఖ న‌టుడు , టీవీకే పార్టీ చీఫ్ విజ‌య్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. డీఎంకే స‌ర్కార్ తో తాడో పేడో తేల్చుకునేందుకు ఆయ‌న సిద్ద‌మ‌య్యారు. ఇప్ప‌టికే త‌న‌ను తీవ్ర ఇబ్బందులు పెడుతూ వ‌స్తున్న సీఎం ఎంకే స్టాలిన్ తో పాటు కేంద్రంలోని అమిత్ షా, మోదీతో యుద్దానికి సిద్ద‌మ‌య్యారు. ఇదిలా ఉండ‌గా త‌మిళ‌నాడు రాష్ట్రంలో అత్య‌ధిక జ‌నాద‌ర‌ణ క‌లిగిన న‌టుల‌లో తను టాప్ లో కొన‌సాగుతున్నాడు. అంతే కాకుండా ప్ర‌పంచ వ్యాప్తంగా కోట్లాది ఫ్యాన్స్ ను క‌లిగి ఉన్నాడు. త‌న ఫ్యాన్స్ ఒత్తిడిని త‌ట్టుకోలేక సింగ‌పూర్ లో త‌న సినిమాను ఆడియో లాంచ్ చేయాల్సి వ‌చ్చింది.

ఈ త‌రుణంలో జ‌న నాయ‌గ‌న్ త‌న చివ‌రి చిత్రం అర్దాంత‌రంగా ఆగి పోవ‌డంతో విజ‌య్ ముందుకే వెళ్లాల‌ని నిర్ణ‌యం తీసుకున్నాడు. ఈ మేర‌కు ఇవాళ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశాడు. తాము త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే రాష్ట్ర శాస‌న స‌భ ఎన్నిక‌ల్లో మొత్తం 234 శాస‌న స‌భ స్థానాల‌లో పోటీ చేస్తామ‌ని వెల్ల‌డించాడు. ఇదిలా ఉండ‌గా తమిళనాడు శాసనసభ ఎన్నికలకు సన్నాహాలు ఊపందుకుంటున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల సంబంధిత కార్యకలాపాలను సమన్వయం చేయడానికి, పర్యవేక్షించడానికి తమిళగ వెట్రి కజగం (టీవీకే) అధ్యక్షుడు విజయ్ ఎన్నికల ప్రచార కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *