వెబ్ సీరీస్ లో సైతం లవ్లీ క్వీన్ హల్ చల్
ముంబై : బాలీవుడ్ బ్యూటీ క్వీన్ మాధురీ దీక్షిత్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారింది. తను సినిమాల నుంచి కొంత దూరం పెరిగినా ఇప్పుడు తన రూట్ మార్చింది. ప్రముఖ రియాల్టీ షోలలో పాల్గొంటోంది. అంతే కాకుండా తను కీ రోల్ పోషిస్తూ తన అభిమానులను అలరిస్తూ వస్తోంది. ఒకప్పుడు తేజాబ్ మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 1990 నుంచి 2020 వరకు ఒక ఊపు ఊపింది. తన అందచందాలతో ఆకట్టుకుంది. అంతే కాకుండా సూపర్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. అంతే కాకుండా ఒకానొక దశలో హీరోలను పక్కన పెట్టి తను రాజ్యం ఏలింది మాధురి దీక్షిత్ నేనే.
ఆ తర్వాత వెబ్ సీరీస్ మీద ఫోకస్ పెట్టింది. తాజాగా సంక్రాంతి పండుగ వేళ ఉన్నట్టుండి ఝలక్ ఇచ్చింది. డిఫరెంట్ యాంగిల్స్ లో మాధురి దీక్షిత్ ఫోటో షూట్ చేసింది. తన ఫోటోలతో పిచ్చెక్కించింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. వయసు మీద పడినా తనలో అందం ఏ మాత్రం చెదర లేదని నిరూపించింది ఈ అందాల ముద్దుగుమ్మ. ఏది ఏమైనా తనకంటూ ఎదురే లేదని చాటి చెప్పింది మాధురీ దీక్షిత్ నేనే. ప్రస్తుతం సినిమాలలో తనను మరోసారి నటింప చేయాలని దర్శక, నిర్మాతలు ప్రస్తుతం ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. ఈ విషయం ఇప్పుడు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.






