సంచలన ఆరోపణలు చేసిన మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి
హైదరాబాద్ : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుపై నిప్పులు చెరిగారు మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి. ఆయన ఇవాళ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో చిల్లర రాతలు రాస్తున్న మీడియా సంస్థల వెనుక బాబు హస్తం ఉందంటూ ఆరోపించారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. ఇకనైనా ఒళ్లు దగ్గర పెట్టుకుని రాజకీయాలు చేయాలని లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చారు జగదీశ్ రెడ్డి. ఈ స్లాటర్ హౌసులు అన్నీ చంద్రబాబు పెంచి పోషించిన కలుపు మొక్కలే నని అన్నారు. రూ. 1600 కోట్ల నైని కోల్ బ్లాక్ గనుల టెండర్ల రద్దు కోసమే ఈ ఆరోపణలు, కథనాలు వస్తున్నాయి అంటున్నారని అన్నారు.
దీని మీద ఏసీబీతో విచారణ చేయించాలని డీజీపీని డిమాండ్ చేస్తున్నాను అని అన్నారు జగదీశ్ రెడ్డి. చంద్రబాబుకి తెలంగాణలో ఏ గతి పట్టిందో రేవంత్ రెడ్డికి అంతకంటే అధ్వాన్నమైన గతి పడుతుందని జర జాగ్రత్తగా ఉండాలని హితవు పలికారు. నీ దొంగతనంలో వాటా అడుగుతున్నారని, నీ మంత్రుల మీద నువ్వే కుట్ర చేసావు అని ఆరోపించారు. పేర్లు పెట్టకుండా వచ్చిన కథనం మీదనే ఉరికిరికి స్పందించిన డీజీపీ.. ప్రతిపక్ష నాయకులైన కేటీఆర్, హరీష్ రావు, నా మీద ఇష్టం వచ్చినట్లు గాంధీ భవన్ నుండి ఘోస్ట్ వెబ్సైట్ల ద్వారా మమ్మల్ని ఇబ్బంది పెట్టే రాతలు వస్తే అప్పుడు ఏం చేశాడని ప్రశ్నించారు. మీకు కంప్లైంట్ పంపిస్తే కూడా చర్యలు ఏమీ తీసుకోలేదు.. అధికారులకు ఒక నీతి, నాయకులకు ఒక నీతి ఉంటుందా బిడ్డా రేవంత్.. నీ గురువు చంద్రబాబు కూడా నీ లెక్కనే ప్రగల్భాలు పలికితే తెలంగాణ ప్రజలు బొంద పెట్టడం ఖాయమన్నారు.






