మొక్కులు చెల్లించుకున్న రోడ్లు, భవనాల శాఖ మంత్రి
వరంగల్ జిల్లా : ప్రపంచంలోనే అతి పెద్ద జాతర మేడారం జనసంద్రంగా మారింది. లక్షలాది మంది భక్తులు తరలి వస్తున్నారు తండోప తండాలుగా. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు సైతం వన దేవతలను దర్శించుకున్నారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. మేడారం సమ్మక్క–సారలమ్మ వనదేవతలను దర్శించుకొని పూజలు చేశారు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.
మహా గిరిజన జాతర ఏర్పాట్లు, అమ్మవార్ల గద్దెల శాశ్వత నిర్మాణాలపై ఆర్, బి అధికారులతో సమీక్ష నిర్వహించారు అమ్మ వార్లను దర్శించుకున్న అనంతరం.
సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరను భక్తి, శ్రద్ధలతో నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నామని ఈ సందర్బంగా చెప్పారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పవిత్ర నాగోబా జాతర సందర్భంగా ఆదివాసీ సోదర, సోదరీమణులందరికీ
శుభాకాంక్షలు తెలిపారు. గోండు ఆదివాసీల ఆరాధ్య దైవమైన నాగోబా దేవుని జాతర ప్రకృతి, ఆధ్యాత్మికత, సామూహిక జీవన విలువలకు ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. తరతరాలుగా కొనసాగుతున్న ఈ సంప్రదాయం ఆదివాసీ సంస్కృతి వైభవాన్ని చాటుతోందన్నారు.







