భారత రాయబారి మృదుల్ కుమార్ తో భేటీ
జురిచ్ : విదేశీ పర్యటనలో బిజీగా ఉన్నారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. స్విట్జర్లాండ్ లోని జురిచ్ లో భారత రాయబారి మృదుల్ కుమార్‌తో ఉత్పాదక సమావేశం జరిగింది. AP-స్విట్జర్లాండ్ వాణిజ్య సంబంధాలను బలోపేతం చేయడం, టెక్నాలజీ, తయారీ, ఎలక్ట్రానిక్స్, ఫార్మా, రైలు, R&D , ఆవిష్కరణలలో ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టడానికి స్విస్ కంపెనీలను ప్రోత్సహించడం గురించి విస్తృతంగా చర్చించారు సీఎం. నైపుణ్యం కలిగిన నిపుణులు, విద్యార్థులు, తెలుగు డయాస్పోరాకు ఎక్కువ అవకాశాలతో పాటు, AI, ఫార్మా, వైద్య పరికరాలు, స్టార్టప్‌లలో ప్రముఖ స్విస్ విశ్వ విద్యాలయాలు , AP సంస్థల మధ్య లోతైన సహకారాన్ని కూడా కోరడం జరిగిందని చెప్పారు చంద్రబాబు నాయుడు.
ఇండియా-EFTA TEPA ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడి, ఉద్యోగాలు, ఆవిష్కరణల కొత్త అధ్యాయాన్ని తెరుస్తుందని ఈ సందర్బంగా తాను విశ్వసిస్తున్నట్లు తెలిపారు ఈ సందర్భంగా. ఇదిలా ఉండగా ప్రపంచంలోనే టాప్ దిగ్గజ ఐటీ సంస్థ గూగుల్ అతి పెద్ద డేటా సెంటర్ ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. గతంలో ఎన్నడూ లేని రీతిలో పెద్ద ఎత్తున ఏపీ రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువలా వచ్చాయన్నారు. ఇదే క్రమంలో తాము పూర్తిగా ఎర్ర తివాచి పరుస్తున్నామని, పెట్టుబడిదారులు, కార్పొరేట్ కంపెనీలకు స్వర్గధామంగా మారేలా చర్యలు చేపట్టామన్నారు చంద్రబాబు నాయుడు





