సోషల్ మీడియాలో హీరోయిన్లు వైరల్
చెన్నై : తమిళ చలన చిత్ర పరిశ్రమలో మోస్ట్ పాపులర్ హీరోయిన్లుగా గుర్తింపు పొందారు త్రిషా కృష్ణన్, నయనతార. ఈ ఇద్దరూ మంచి స్నేహితురాళ్లుగా ఉన్నారు. ఇద్దరూ తమ తమ సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇదే సమయంలో ఎవరికి వారే వెరీ వెరీ స్పెషల్. సినీ ఇండస్ట్రీలో అతి పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ ఇద్దరూ పోటీ పడుతూ నటిస్తూ వచ్చారు. తమ తమ స్థానాలలో కొలువు తీరారు. ఏ పాత్ర ఇచ్చినా సరే వాటికి న్యాయం చేస్తూ వచ్చారు. ఎక్కడా రాజీ పడరు. వారి నడకలో, నటనలో, మాటలలో ఓ ప్రత్యేకత ఉంటుంది. అందుకే వారికి అంత ప్రయారిటీ . సినిమాల రేంజ్ విషయానికి వస్తే భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు.
ఓ వైపు కొన్ని సినిమాలకు మాత్రమే పరిమితం అవుతే, ఇంకొందరు ఒకే ఒక్క సినిమాలో దర్శనం ఇచ్చి ఆ తర్వాత కనుమరుగై పోతున్నారు. కానీ త్రిషా కృష్ణన్, నయనతారలు మాత్రం అన్ స్టాపబుల్ అంటూ ముందుకు సాగుతుండడం విశేషం. ఇదే క్రమంలో ఈ ఇద్దరూ తాజాగా కలిసి కనిపించారు. బోటులో సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు హల్ చల్ చేస్తున్నాయి. సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్నాయి. తమ ఇద్దరి మధ్య ఎలాంటి విభేదాలు లేవని, తాము కలిసి ఉంటామని స్పష్టం చేశారు. తమపై నోరు పారేసుకుంటున్న వారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.







