స్పష్టం చేసిన హొం శాఖ మంత్రి వంగలపూడి
అమరావతి : మనిషి జీవితంలో పైకి ఎదగాలంటే కష్టపడాలని అన్నారు రాష్ట్ర హొం శాఖ మంత్రి వంగలపూడి అనిత. స్వచ్చ ఆంధ్ర కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్బంగా పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం బాలికా దినోత్సవం సందర్బంగా విద్యార్థినులకు శుభాకాంక్షలు తెలిపారు. చదువు ఒక్కటే మనల్ని ఉన్నతమైన వ్యక్తులుగా తీర్చిదద్దుతుందని చెప్పారు. ఉన్నతమైన స్థానం చేరుకుంటే సమాజం గౌరవిస్తుందని అన్నారు వంగలపూడి అనిత. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచు కోవాలని సూచించారు. తమ కూటమి ప్రభుత్వం విద్యా రంగంపై ఫోకస్ పెట్టిందని అన్నారు. సమర్థవంతుమైన నాయకుడు, సీఎం నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాలలో పరుగులు తీస్తోందన్నారు.
ముఖ్యమంత్రి దార్శనికత వల్ల స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోందని చెప్పారు. అనకాపల్లి జిల్లా కశింకోట మండలం తేగాడ మోడల్ స్కూల్‌లో నిర్వహించిన స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న వంగలపూడి అనిత పారిశుధ్య కార్మికులను సత్కరించడం ఆనందంగా ఉందన్నారు. కలెక్టర్ విజయకృష్ణన్ తో కలిసి పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. పరిసరాల పరిశుభ్రతపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యార్థులకు చెత్త నిర్వహణ, మొక్కల పెంపకం, నీటి సరఫరా వంటి అంశాలపై ఎరుక కలిగి ఉండాలన్నారు . జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా విద్యార్థినులతో కలిసి కేక్ కట్ చేశారు వంగలపూడి అనిత.






