హైడ్రా అడిషనల్ డైరెక్టర్ వర్ల పాపయ్య
హైదరాబాద్ : భారత రాజ్యాంగం ప్రజాస్వామ్యానికి మూల స్తంభం అని పేర్కొన్నారు హైడ్రా అడిషనల్ డైరెక్టర్ వర్ల పాపయ్య. స్వాతంత్య్రం సాధించుకున్నాం. ప్రజాస్వామ్య దేశంగా అవతరించాం. స్వేచ్ఛాయుత జీవితాన్ని గడుపుతున్నాం.. మనం అనుభవిస్తున్న ప్రజాస్వామ్యానికి, స్వాతంత్య్రానికి నియమ నియంత్రణలే భారత రాజ్యాంగం అని చెప్పారు. నియమ నియంత్రణలు లేకపోతే ప్రజాస్వామ్యం గాడి తప్పుతుందని అన్నారు వర్ల పాపయ్య. బాధ్యత గల పౌరుడిగా మనం నిర్వహించాల్సిన విధులు, అనుసరించాల్సిన విధానాలను అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి ఒక్కరూ భారత రాజ్యాంగాన్ని చదవాలని ఆయన సూచించారు. ప్రజలకు మెరుగైన జీవనాన్ని అందించాలనేది ప్రభుత్వ ఉద్దేశమని స్పష్టం చేశారు.
ఆ దిశగా పర్యావరణ హితమైన నగరంగా హైదరాబాద్‌ను హైడ్రా తీర్చిదిద్దుతోందన్నారు అడిషనల్ డైరెక్టర్. ప్రభుత్వ భూములు, పార్కులు, చెరువులు, నాలాలు, ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలను కాపాడుకున్నప్పుడే.. ప్రకృతి వైపరీత్యాలను నియంత్రించగలమని వర్ల పాపయ్య అన్నారు. పార్కులను కాపాడి పచ్చని వాతావరణాన్ని, చెరువులు, నాలాలను రక్షించి వరదలను నియంత్రిస్తున్నామన్నారు. హైడ్రా అడిషనల్ కమిషనర్ ఆర్ సుదర్శన్ , ఏసీపీలు తిరుమల్, ఉమా మహేశ్వరరావు, రీజనల్ ఫైర్ ఆఫీసర్ జయప్రకాష్, డీఎఫ్‌వోలు యజ్జ నారాయణ , శ్రీ గౌతమ్ , ఏడీఎఫ్‌వో మోహన్ రావు , హైడ్రా ఇన్స్పెక్టర్లు, ఎస్ ఎఫ్ వోలు ఇతర అధికారులు సిబ్బంది గణతంత్ర దినోత్సవంలో పాల్గొన్నారు.






