మాజీ ఎంపీ జోగిన‌ప‌ల్లికి సిట్ బిగ్ షాక్

హాజ‌రు కావాలంటూ నోటీసులు జారీ

హైద‌రాబాద్ : దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు వ్య‌వ‌హారం రోజు రోజుకు కొత్త మ‌లుపు తిరుగుతోంది. ఇందులో భాగంగా ప్ర‌స్తుతం దీనిపై ఎక్కువ‌గా చ‌ర్చ జ‌రుగుతోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప‌లువురు ప్ర‌ముఖులు తీవ్ర ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్నారు. వారిలో ప్రభాక‌ర్ రావు, రాధా కిష‌న్ రావు, క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు, తార‌క రామారావు, త‌న్నీరు హ‌రీశ్ రావుతో పాటు జోగిన‌ప‌ల్లి సంతోష్ కుమార్ ఉన్నారు. ఇప్ప‌టికే ప‌లుమార్లు ప్ర‌భాక‌ర్ రావు, రాధా కిష‌న్ రావుల‌ను విచారించింది సిట్. మ‌రో వైపు ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో మాజీ మంత్రులు, బావా బామ్మ‌ర్దులు హ‌రీష్ రావు, కేటీఆర్ ల‌ను 7 గంట‌ల‌కు పైగా విచారించింది. తాజాగా ఇదే కోట‌రీ, కుటుంబానికి సంబంధించి మాజీ పార్ల‌మెంట్ స‌భ్యుడు జోగిన‌ప‌ల్లి సంతోష్ కుమార్ కు కూడా సిట్ షాక్ ఇచ్చింది.

ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి త‌మ ముందు హాజ‌రు కావాల‌ని సిట్ స్ప‌ష్టం చేసింది. ఈ మేర‌కు నోటీసులు జారీ చేసింది. ఏ మాత్రం ఆల‌స్యం చేసినా చ‌ర్య‌లు త‌ప్ప‌వంటూ వార్నింగ్ ఇచ్చింది. దీంతో మ‌నోడు దారికి వ‌చ్చాడు. తాను సిట్ జారీ చేసిన నోటీసుల‌ను అందుకున్నాన‌ని, త‌ప్ప‌కుండా సిట్ ముందు హాజ‌ర‌వుతాన‌ని తెలిపాడు. త‌న‌కు చ‌ట్టం ప‌ట్ల గౌర‌వం ఉంద‌ని, వారు ఏది అడిగినా వివ‌రాలు ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నాన‌ని పేర్కొన్నాడు జోగిన‌ప‌ల్లి సంతోష్ కుమార్. ప్ర‌స్తుతం త‌ను బీఆర్ఎస్ పార్టీకి జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీగా ఉన్నారు. సిట్ అధికారులు 160 సీఆర్పీసీ కింద నోటీస్ ఇచ్చారు. జూబ్లీహిల్స్ లోని సిట్ కార్యాల‌యానికి రావాల‌ని నోటీసులో పేర్కొంది.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *