పాట‌ల కోయిల‌మ్మా వ‌ర్దిల్ల‌వ‌మ్మా..!

ప‌ద్మభూష‌ణ్ అవార్డును తిర‌స్క‌రణ

అమ‌రావ‌తి : ఆత్మ గౌర‌వం క‌లిగిన అరుదైన గాయ‌ని ఎస్. జాన‌కి. త‌ను ప‌లు భాష‌ల‌లో వేల పాట‌లు పాడారు. త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌మైన అభిమానుల‌ను సంపాదించుకున్నారు. ఎక్కువ పాట‌లు దివంగ‌త గాయ‌కుడు ఎస్పీ బాల‌సుబ్ర‌మ‌ణ్యంతో క‌లిసి పాడారు. ఆమె దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించారు ఆ మ‌ధ్య‌న కేంద్రం ప్ర‌క‌టించిన అత్యున్న‌త అవార్డు ప‌ద్మ‌భూష‌ణ్ ను . ఈ దేశ మూల వాసులైన‌ దక్షిణ భారతీయ‌, ద్రావిడలకు జరుగుతున్న అన్యాయంపై నిరసన తెలిపారు. మెరుగైన వ్య‌క్తిత్వం క‌లిగిన గాయ‌ని త‌ను. త‌ను ఒక‌టా రెండా ఏకంగా 18కి పైగా భాష‌ల‌లో పాట‌లు పాడారు ఎస్. జాన‌కి. వాటిలో ఎక్కువ‌గా తెలుగు, త‌మిళం, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం, బెంగాలీ, హిందీ, ఒరియా, సింహళం, తులు, కొంకణి, ఉర్దూ, మరాఠీ , త‌దిత‌ర భాష‌లు ఉన్నాయి.

40 వేల‌కు పైగా పాట‌లు పాడారు జాన‌క‌మ్మ‌. ఇందులో ఎక్కువ‌గా సినిమా పాట‌లు, భ‌క్తి గీతాలు, ల‌లిత గీతాలు, జాన‌ప‌ద గీతాలు ఉన్నాయి. ఎస్. జానకి గారు కేవలం గొప్ప గాయని మాత్రమే కాదు, భాషల సరిహద్దులు చెరిపేసిన స్వరం. ఒకే గొంతుతో అమాయకత్వం, వేదన, భక్తి, ప్రేమ, విరహం అన్నీ వ్యక్తపరచగల అద్భుత కళాకారిణి. ప్రతి భాషను ఆ భాషలా పలికించిన స్వచ్ఛత, ప్రతి పాత్రకు ప్రాణం పోసిన భావవ్యక్తీకరణ, సంగీత దర్శకుల కలలను నిజం చేసిన క్రమశిక్షణ ఇవన్నీ కలిసి ఆమెను పాటల తల్లిగా నిలబెట్టాయి. దశాబ్దాల తరబడి తరతరాల హృదయాల్లో నిలిచి పోయిన ఆమె స్వరం, కాలం మారినా విలువ తగ్గని సంగీత సంస్కృతికి చిరునామాగా నిలుస్తుంది.

  • Related Posts

    వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ వాయిదా

    హైద‌రాబాద్ : అంద‌రూ అనుకున్న‌ట్లే విక్ట‌రీ వెంక‌టేష్ కీ రోల్ పోషించిన త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఆద‌ర్శ కుటుంబం వాయిదా ప‌డింది. ఈ విష‌యాన్ని సోష‌ల్ మీడియా వేదిక‌గా సోమ‌వారం ప్ర‌క‌టించారు నిర్మాత నాగ‌వంశీ. వాస్తవానికి అక్టోబ‌ర్ 9వ తేదీన…

    ర‌ష్మిక మంద‌న్నా..దేవుడిచ్చిన వ‌రం : దేవ‌ర‌కొండ

    హైద‌రాబాద్ : యువ క‌థానాయ‌కుడు విజ‌య్ దేవ‌ర‌కొండ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. త‌ను త‌న భార్య‌, నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్నాతో క‌లిసి రాహుల్ సాంకృత్య‌న్ ద‌ర్శ‌క‌త్వంలో చారిత్రాత్మ‌క‌మైన ర‌ణ‌బాలి మూవీలో క‌లిసి న‌టిస్తున్నారు. గ‌తంలో ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ ఇద్ద‌రూ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *