Friday, 16 October 2026

భార‌త రాజ్యాంగం అత్యున్న‌త‌మైన‌ది

newsseals-Janasena

పౌర స‌ర‌ఫ‌రాల శాఖ మంత్రి మ‌నోహ‌ర్

మంగ‌ళ‌గిరి : ప్ర‌పంచంలోనే అత్యున్న‌త‌మైన‌ది భార‌త రాజ్యాంగం అని అన్నారు రాష్ట్ర పౌర స‌ర‌ఫ‌రాల శాఖ మంత్రి నాదెండ్ల మ‌నోహ‌ర్. సోమ‌వారం జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జ‌రిగాయి. ఈ సంద‌ర్బంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ . గౌరవ వందనం పోలీసుల నుంచి స్వీక‌రించారు. అనంతరం జాతీయ గీతాలాపన చేశారు. పార్టీ నేతలకు, కార్యాలయ సిబ్బందికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. గార్డులు వందనం సమర్పించారు.

ఈ కార్యక్రమంలో శాసన మండలిలో ప్రభుత్వ విప్ పిడుగు హరిప్రసాద్, ఆంధ్రప్రదేశ్ వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ చిల్లపల్లి శ్రీనివాసరావు, రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ కళ్యాణం శివ శ్రీనివాసరావు, పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, పార్టీ నాయకులు సయ్యద్ జిలానీ, నయబ్ కమల్, గంజి చిరంజీవి, బేతపూడి విజయ శేఖర్, గరికపాటి శివశంకర్, రావి సౌజన్య, పార్వతి నాయుడు, శివ పార్వతి, మండలి రాజేష్, తోట సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *