సోష‌ల్ మీడియా ప్ర‌భావంపై స‌ర్కార్ ఆందోళ‌న

Spread the love

దీనిని మ‌రింత సురక్షితంగా ఉండేలా చూడాలి

అమ‌రావ‌తి : ఏపీ విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రాను రాను సోష‌ల్ మీడియా ప్ర‌భావం కార‌ణంగా మంచి కంటే చెడు ఎక్కువ‌గా ఆక‌ర్షిస్తోంద‌ని ఆవేద‌న చెందారు. గురువారం అమ‌రావ‌తి లోని స‌చివాల‌యంలో జ‌రిగిన కీల‌క స‌మావేశంలో నారా లోకేష్ తో పాటు మంత్రులు అనిత వంగ‌ల‌పూడి, స‌త్య కుమార్ యాద‌వ్, నాదెండ్ల మ‌నోహ‌ర్ , త‌దిత‌రులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్బ‌గా కీల‌క సూచ‌న‌లు చేశారు. రోజు రోజుకు విద్యార్థులు , చిన్నారుల‌తో పాటు యువ‌త‌, ప్ర‌తి ఒక్క‌రూ వీటి బారిన ప‌డ్డార‌ని, విలువైన కాలాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నార‌ని పేర్కొన్నారు నారా లోకేష్. ఇదే స‌మ‌యంలో సోషల్ మీడియాపై నమ్మకం తెగిపోతోందని అన్నారు.

పిల్లలు నిరంతర వినియోగంలోకి జారిపోతున్నారని వాపోయారు , ఇది వారి దృష్టిని, విద్యను ప్రభావితం చేస్తుందన్నారు. మహిళలు నిరంతర ఆన్‌లైన్ దుర్వినియోగాన్ని ఎదుర్కొంటున్నార‌ని. దీనిని విస్మరించ లేమ‌న్నారు. ఇందుకు సంబంధించి రాష్ట్ర కూట‌మి స‌ర్కార్ చ‌ర్య తీసుకోవాల‌ని నిర్ణ‌యం తీసుకుంద‌న్నారు నారా లోకేష్‌. సోషల్ మీడియాపై మంత్రుల బృందం సమావేశంలో, వయస్సుకు తగిన యాక్సెస్ కోసం చట్ట పరమైన చట్రాలను అధ్యయనం చేయాలని సూచించారు. గ్లోబల్ ఉత్తమ పద్ధతులను పరిశీలించడానికి తాము మెటా, ఎక్స్, గూగుల్ , షేర్‌చాట్ వంటి ప్రధాన ప్లాట్‌ఫామ్‌లను తదుపరి GOM సమావేశానికి ఆహ్వానించడం జ‌రిగింద‌న్నారు. సోషల్ మీడియా సురక్షితమైన ప్రదేశంగా మారుతుందన్నారు.

  • Related Posts

    అగ్ని ప్ర‌మాదాల‌పై హైడ్రా అవ‌గాహన‌

    Spread the love

    Spread the loveశ్రీ‌కారం చుట్టిన క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ హైద‌రాబాద్ : హైడ్రా దూకుడు పెంచింది. హైద‌రాబాద్ మ‌హా న‌గ‌రంలో వ‌రుస‌గా అగ్ని ప్ర‌మాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవ‌లే నాంప‌ల్లి లోని ఫ‌ర్నీచ‌ర్ షో రూంలో భారీ ప్ర‌మాదం చోటు చేసుకుంది.…

    త్యాగ ధ‌నుడు రావి నారాయ‌ణ రెడ్డి

    Spread the love

    Spread the loveమ‌హ‌నీయుడ‌న్న సీఎం రేవంత్ రెడ్డి హైద‌రాబాద్ : తెలంగాణ ప్రజల స్వేచ్ఛ కోసం, పేదల హక్కుల కోసం పోరాటం చేయడమే కాదు, సర్వం త్యాగం చేసిన మహనీయుడు రావి నారాయణ రెడ్డి అని కొనియాడారు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *