Friday, 16 October 2026

వింగ్స్ ఇండియా 2026 ప్రారంభం

newsseals-RamMohanNaidu

స్టార్ట్ చేసిన రామ్మోహ‌న్ నాయుడు

హైద‌రాబాద్ : హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయంలో భారతదేశంలోనే ప్రీమియర్ , ఆసియాలోనే అతిపెద్ద పౌర విమానయాన కార్యక్రమం అయిన వింగ్స్ ఇండియా 2026ను కేంద్ర పౌర విమాన‌యాన శాఖ మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు ప్రారంభించారు. ఈ సంద‌ర్బంగా మంత్రి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. స‌మ‌ర్థ‌వంతుడైన నాయ‌కుడైన ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ నాయ‌త్వంలో భారతదేశం తన అద్భుతమైన విమానయాన వృద్ధి కథను ప్రపంచానికి గర్వంగా చెప్పేందుకు ప్ర‌య‌త్నం చేస్తోంద‌న్నారు.

భారతీయ విమానయానం, భవిష్యత్తును సుగమం చేయడం – డిజైన్ నుండి విస్తరణ వరకు, తయారీ నుండి నిర్వహణ వరకు, చేరిక నుండి ఆవిష్కరణ వరకు, భద్రత నుండి స్థిరత్వం వరకు అనే థీమ్‌తో, వింగ్స్ ఇండియా 2026 ప్రపంచ పరిశ్రమ నాయకులు, ఆవిష్కర్తలు, వాటాదారులను ఒకచోట చేర్చిందని చెప్పారు.

రాబోయే నాలుగు రోజులలో, ఈ కార్యక్రమం భారతదేశానికి సంబంధించి విస్తరిస్తున్న సామర్థ్యాలను, అత్యాధునిక ఆవిష్కరణలను, పెరుగుతున్న ప్రపంచ భాగస్వామ్యాలను ప్రదర్శిస్తుందన్నారు. ఇవి ఏవియేషన్ హబ్‌గా మారే దిశగా మన ప్రయాణాన్ని మ‌రింత‌ బలోపేతం చేస్తాయని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *