Friday, 16 October 2026

శ్రీ కపిలేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు

newsseals-Kapileshwwaralayam

ఫిబ్ర‌వ‌రి 8 నుండి 17వ తేదీ వ‌ర‌కు

తిరుపతి : తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఫిబ్ర‌వ‌రి 8 నుండి 17వ తేదీ వరకు వైభవంగా జరగనున్నాయి. ఇందులో భాగంగా ఫిబ్రవరి 7న శాస్త్రోక్తంగా అంకురార్పణ కార్యక్రమం నిర్వ‌హిస్తారు. ఫిబ్రవరి 04వ తేదీన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జ‌రుగుతుంది. ప్రతిరోజూ ఉదయం 7 నుండి 9 గంటల వరకు, తిరిగి రాత్రి 7 నుండి 9 గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయి. ఉత్స‌వాల‌లో భాగంగా 8వ తేదీన ఉద‌యం ధ్వజారోహణం (ఉ.6.05 గంట‌ల‌కు మ‌క‌ర ల‌గ్నం), ప‌ల్ల‌కీ సేవ‌ (ఉ.7 నుండి 9 గంట‌ల వ‌ర‌కు) , రాత్రి హంస వాహనం ఉంటుంది. 9వ తేదీన ఉద‌యం సూర్యప్రభ వాహనం, రాత్రి చంద్రప్రభ వాహనం, 10న ఉద‌యం భూత వాహ‌నం, రాత్రి సింహ‌వాహ‌నంపై స్వామి వారు భ‌క్తులను అనుగ్ర‌హిస్తారు.

11వ తేదీన ఉద‌యం మ‌క‌ర వాహ‌నం, రాత్రి శేష వాహ‌నం, 12న ఉద‌యం తిరుచ్చి ఉత్సవం , రాత్రి అధికార నంది వాహనం, 13న ఉద‌యం వ్యాఘ్ర వాహనం , రాత్రి గ‌జ వాహ‌నం, 14న ఉద‌యం క‌ల్ప‌వృక్ష వాహ‌నం, రాత్రి అశ్వ వాహ‌నం, 15న ఉద‌యంం ర‌థోత్స‌వం (భోగి తేరు) , రాత్రి నంది వాహ‌నం, 16న
ఉద‌యంపురుషామృగ వాహనం (ఉ.8 నుండి 10 గంట‌ల వ‌ర‌కు), సాయంత్రం శివ పార్వతుల కల్యాణోత్సవం (సా.6 నుండి రాత్రి 7.30 గంట‌ల వ‌ర‌కు), రాత్రి తిరుచ్చి ఉత్సవం (రా.8 నుండి 10 గంట‌ల వ‌ర‌కు), 17 న ఉద‌యం సూర్యప్ర‌భ వాహ‌నంపై న‌ట‌రాజ స్వామివారు (ఉ.6.30 నుండి 9 గంట‌ల వ‌ర‌కు),
త్రిశూల స్నానం (ఉ.9 నుండి 10.30 గంట‌ల వ‌ర‌కు), సాయంత్రం ధ్వజావ రోహణం (సా.6 నుండి రాత్రి 7.30 గంట‌ల వ‌ర‌కు), రాత్రి రావణాసుర వాహనం (రా.8 నుండి 10 గంట‌ల వ‌ర‌కు) ఉంటుంద‌ని టీటీడీ తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *