నల్లగొండ సమగ్ర అభివృద్ధే నా లక్ష్యం

VijayaBhaskar · February 3, 2026
Spread the love

స్ప‌ష్టం చేసిన మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి

న‌ల్ల‌గొండ జిల్లా : న‌ల్ల‌గొండ ప‌ట్ట‌ణాన్ని స‌ర్వాంగ సుంద‌రంగా , అభివృద్దికి కేరాఫ్ గా మార్చేందుకు ప్ర‌య‌త్నం చేస్తాన‌ని ప్ర‌క‌టించారు రాష్ట్ర రోడ్లు, భ‌వ‌నాల శాఖ మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి. ఈరోజు నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని చర్లపల్లి, మర్రిగూడ (14, 15 డివిజన్ల) ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మన నగరాన్ని కేవలం పట్టణంగానే కాకుండా, రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత అతిపెద్ద సూపర్ స్మార్ట్ సిటీ గా తీర్చిదిద్దడమే నా సంకల్పం అని ప్ర‌క‌టించారు. ఇందు కోసం ఎన్ని కోట్లు అయినా తీసుకు వ‌స్తాన‌ని, ఆ పూచీ నాద‌ని అన్నారు కోమ‌టి రెడ్డి వెంక‌ట్ రెడ్డి.

ఈ అభివృద్ధి ప్రణాళికలు సాకారం కావాలంటే 48కి 48 డివిజన్లలో కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. స్థిర‌మైన ప్ర‌భుత్వం రాష్ట్రంలో ఉంద‌న్నారు. ప్ర‌జా పాల‌న కొన‌సాగుతోంద‌ని చెప్పారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తు పై ఓటు వేసి, నల్లగొండ ఉజ్వల భవిష్యత్తును ఆశీర్వదించాల‌ని కోరారు. ఇదిలా ఉండ‌గా ఎన్నిక‌లు పూర్త‌య్యేంత వ‌ర‌కు కాంగ్రెస్ పార్టీకి చెందిన శ్రేణులు జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని సూచించారు. ప్ర‌త్య‌ర్థి పార్టీల‌కు ఒక్క సీటు కూడా రాకుండా చూసు కోవాల్సిన బాధ్య‌త మీపై ఉంద‌ని స్ప‌ష్టం చేశారు కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి.