కేంద్ర స‌ర్కార్ పై ష‌ర్మిలా రెడ్డి ఫైర్

Spread the love

ఉపాధి హామీ ప‌థ‌కానికి కేంద్రం తూట్లు

అమ‌రావ‌తి : మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌జా వ్య‌తిరేక విధానాల‌ను అవలంబిస్తోంద‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు ఏపీపీసీసీ రాష్ట్ర అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ (MGNREGA) పరిరక్షణ యాత్ర అనంత‌పురం జిల్లాలో ముగిసింది. ఇవాళ శ్రీ స‌త్య‌సాయి జిల్లాలో కొన‌సాగింది. ధర్మవరం నియోజకవర్గం రాఘవంపల్లి గ్రామంలో కరువు పనికొచ్చిన శ్రామికులను కలిసి VB G – RAM G చట్టం ద్వారా జరిగే నష్టాలను వివరించారు ష‌ర్మిలా రెడ్డి. మన్రేగా పథకాన్ని ప్రస్తుత పాలకులు బ్రష్టు పట్టించారని ధ్వ‌జ‌మెత్తారు. 100 రోజుల పనిలో సగం రోజులు కూడా పని కల్పించడం లేదని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

అర్హత కలిగిన పేదల జాబ్ కార్డులు కూడా తొలగించారని శ్రామికులు ష‌ర్మిలా రెడ్డి ఆరోపించారు. మన్రేగా పథకాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ చేపట్టిన పరిరక్షణ ఉద్యమానికి మద్దతు ఇవ్వడం మరింత బలాన్ని ఇచ్చింద‌ని చెప్పారు. శ్రామికులకు భరోసా ఇచ్చే విధంగా తాను సైతం గునపం పట్టి మట్టి తవ్వడం ఆనందంగా ఉంద‌న్నారు. గ‌త 11 ఏళ్ల మోదీ పాల‌నా కాలంలో భార‌త దేశానికి న‌ష్టం త‌ప్ప ఒరిగింది ఏమీ లేద‌న్నారు ష‌ర్మిలా రెడ్డి.

  • Related Posts

    రాజకీయ వ్యభిచారి కాంగ్రెస్ పార్టీ : బండి సంజ‌య్

    Spread the love

    Spread the loveగాంధీభవన్ లోనే ఫిరాయింపు ఎమ్మెల్యేల సంసారం క‌రీంన‌గ‌ర్ జిల్లా : కేంద్ర హొం శాఖ స‌హాయ మంత్రి బండి సంజ‌య్ కుమార్ ప‌టేల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో కొలువు తీరిన కాంగ్రెస్ పార్టీ నిర్వాకంపై భ‌గ్గుమ‌న్నారు. కాంగ్రెస్…

    ఏపీ వార్షిక బ‌డ్జెట్ పై కీల‌క స‌మావేశం

    Spread the love

    Spread the loveసూచ‌న‌లు చేసిన మంత్రి వంగ‌ల‌పూడి అమ‌రావ‌తి : 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ వార్షిక బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్న నేపథ్యంలో ముంద‌స్తుగా బడ్జెట్ కూర్పుపై పోలీస్ శాఖ ఉన్నతాధికారులతో కలిసి రాష్ట్ర ఆర్థిక…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *