తెలంగాణ ఖాకీల నిర్వాకం సుప్రీంకోర్టు ఆగ్ర‌హం

జ‌ర్న‌లిస్ట్ రేవ‌తి కేసులో సీరియ‌స్ కామెంట్స్

ఢిల్లీ : భార‌త దేశ స‌ర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయ‌స్థానం సీరియ‌స్ కామెంట్స్ చేసింది. మ‌హిళా జ‌ర్న‌లిస్ట్ రేవతి ప‌ట్ల తెలంగాణ పోలీసులు అనుస‌రిస్తున్న తీరు ప‌ట్ల ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఇదిలా ఉండ‌గా తెలంగాణ కేంద్రంగా న‌డ‌స్తున్న‌ పల్స్ న్యూస్ జర్నలిస్ట్ రేవతిని గతంలో ఒక న్యూస్ విషయంలో గతేడాది మార్చి నెల‌లో అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ చేయ‌డం ప‌ట్ల తీవ్ర స్థాయిలో మండిప‌డింది. ఆత‌ర్వాత బెయిల్ పై రేవతి విడుద‌లైంది. దీనిని స‌వాల్ చేస్తూ తెలంగాణ ఖాకీలు రూల్స్ ను అతిక్ర‌మిస్తూ రేవతిని త‌మ క‌స్ట‌డీకి ఇవ్వాల‌ని సుప్రీంకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేసింది. ఈ సంద‌ర్బంగా విచార‌ణ చేప‌ట్టిన ధ‌ర్మాస‌నం తీవ్ర స్థాయిలో మండిప‌డింది. బెయిల్ పై విడుద‌లైన ఆరు నెల‌ల త‌ర్వాత , పోలీస్ క‌స్ట‌డీకి ఇవ్వాల‌ని కోర‌డం విడ్డూరంగా ఉంద‌ని పేర్కొంది. ఇదంతా చూస్తుంటే కక్ష సాధింపు త‌ప్పా మ‌రోటి కాద‌ని తేలుతోంద‌ని వ్యాఖ్యానించింది.

పిటిషన్ ఎలా దాఖ‌లు చేస్తారంటూ తీవ్ర అస‌హ‌నం వ్య‌క్తం చేసింది ధ‌ర్మాస‌నం. అయితే చట్ట ప్రకారం..ఏదైనా కేసులో బెయిల్ మంజూరు అయ్యాక పోలీస్ కస్టడి సాధ్యం కాదని స్ప‌ష్ట చేసింది. పదేళ్ల శిక్ష పడే కేసులలో బెయిల్ వచ్చిన 45 రోజులలోపు మాత్రమే పోలీసు కస్టడికి అనుమతి ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది. ఆరు నెలల తర్వాత పోలీస్ కస్టడీ అడగడం ఒక విపరీతమైన నిర్ణయంగా పేర్కొంది సుప్రీం కోర్టు ధర్మాసనం. ఈ కేసులో జర్నలిస్ట్ రేవతి పోలీస్ కస్టడి అప్పీల్ ను నిరాకరించడమే కాకుండా…ఇక మీద కూడా ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాలని తెలంగాణ ఖాకీల‌ను ధ‌ర్మాస‌నం హెచ్చ‌రించింది.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *