హాస్ట‌ళ్ల‌లో స‌దుపాయాల‌పై దృష్టి సారించాలి

ఆదేశించిన ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు

అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో సంక్షేమ వ‌స‌తి గృహాల‌లో క‌నీస వ‌స‌తులు క‌ల్పించేందుకు ప్ర‌త్యేకంగా దృష్టి సారించాల‌ని అన్నారు. విద్యార్థుల‌కు ఇబ్బందులు లేకుండా చూడాల‌ని స్ప‌ష్టం చేశారు. రాష్ట్ర కూట‌మి ప్ర‌భుత్వం ప్ర‌త్యేకంగా విద్యా రంగంపై దృష్టి సారించింద‌న్నారు. ఏపీని ఎడ్యూకేష‌న్, ఐటీ, టూరిజం, లాజిస్టిక్ హ‌బ్ గా మార్చ‌డ‌మే త‌మ ప్ర‌భుత్వ లక్ష్య‌మ‌ని ప్ర‌క‌టించారు. ఇక విద్యా ప‌రంగా కీల‌క సంస్క‌ర‌ణ‌ల‌కు శ్రీ‌కారం చుట్టామ‌న్నారు నారా చంద్ర‌బాబు నాయుడు.

హాస్టళ్లలో శానిటేషన్, ఆహార పదార్ధాల నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారించాలని ఈ సందర్భంగా సీఎం ఆదేశించారు. రెసిడెన్షియల్ స్కూళ్లు, హాస్టళ్ల నిర్మాణంతో పాటు సురక్షిత తాగు నీటి కోసం ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేయాలని అన్నారు. రాష్ట్రంలో 814 హాస్టళ్లలో రూ.17 కోట్ల వ్యయంతో మార్చి లోగా ఆర్వో ప్లాంట్లను ఏర్పాటు చేస్తామని అధికారులు వివరించారు. రూ.60 కోట్ల సాస్కి నిధులతో రెసిడెన్షియల్ పాఠశాలలు, హాస్టళ్ల నిర్మాణం చేపట్టాలని సీఎం ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత, ఆ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *