సూచనలు చేసిన మంత్రి వంగలపూడి
అమరావతి : 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ వార్షిక బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్న నేపథ్యంలో ముందస్తుగా బడ్జెట్ కూర్పుపై పోలీస్ శాఖ ఉన్నతాధికారులతో కలిసి రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తో పాటు రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత పాల్గొన్నారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం హోమ్ శాఖను మరింత పటిష్టంగా నిర్వహించాలని నిర్ణయించారు. అంతే కాకుండా అవసరమైన నిధుల కేటాయింపులపై సుదీర్ఘంగా చర్చించడం జరిగింది.
పోలీస్ శాఖ పరంగా మరిన్ని నిధులు కేటాయించాలని సూచించారు రాష్ట్ర హొం శాఖ మంత్రి వంగలపూడి అనిత. గత సర్కార్ పోలీసుల గురించి పట్టించు కోలేదని పేర్కొన్నారు. ఈసారి ప్రవేశ పెట్టబోయే ఏపీ బడ్జెట్ లో హోం శాఖకు, పోలీసుల అభ్యున్నతి కోసం, మౌలిక సదుపాయాల కల్పన కోసం అత్యధిక నిధులు కేటాయించాలని కోరారు. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ సెక్రటరీలు వినయ్ కుమార్ , రోనాల్డ్ రాస్ , జాయింట్ సెక్రటరీ గౌతమ్ అల్లాడ , హోమ్ శాఖ సెక్రటరీ విజయ్ కుమార్ , అడిషనల్ డీజీ మధుసూదన్ , ఐజీ రవిప్రకాష్ తో పాటు పలువురు ముఖ్య అధికారులు పాల్గొన్నారు.





