తొలి ముఖ్యమంత్రిగా భారత దేశంలో అరుదైన రికార్డ్
న్యూడిల్లీ : తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలనంగా మారారు. భారత దేశంలోనే తొలి సీఎంగా అరుదైన రికార్డ్ సృష్టించారు. ఓటరు జాబితా సవరణ (SIR) ప్రక్రియలో అక్రమాలు జరిగాయంటూ మమతా బెనర్జీ సుప్రీంకోర్టులో స్వయంగా వాదనలు వినిపించారు. ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశారు. అసలు ఈ దేశంలో ప్రజాస్వామ్యం అనేది ఉందా అని ప్రశ్నించారు. ఇంత జరుగుతున్నా పేదలకు, ప్రజలకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేకుండా పోయిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు మమతా బెనర్జీ. ఇదే సమయంలో ముఖ్యమంత్రి కేంద్ర ఎన్నికల సంఘం తీరుపై మండిపడ్డారు.
తాను ఈసీకి ఆరుసార్లు సర్ విషయంలో లేఖలు రాశానని చెప్పారు మమతా బెనర్జీ. కానీ ఇప్పటి వరకు అక్కడి నుంచి తనకు స్పందన రాలేదన్నారు. తనకకే న్యాయం జరగక పోతే ఇక పేదలకు ఎలా న్యాయం అందుతుందని ప్రశ్నించారు సుప్రీంకోర్టు సాక్షిగా. పార్టీ కోసం కాక, ప్రజాస్వామ్య రక్షణ కోసమే తాను ఇక్కడికి వచ్చానని చెప్పారు. రాష్ట్రంలో న్యాయం ఎండమావిగా మారిందన్నారు. ఇదిలా ఉండగా తను సుప్రీంకోర్టుకు వచ్చిన సందర్బంగా భారీ ఎత్తున భద్రతను ఏర్పాటు చేశారు. సీఎం హోదాలో అత్యున్నత న్యాయస్థానంలో వాదించిన తొలి ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ రికార్డు సృష్టించారు.





