ఆదేశించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో సంక్షేమ వసతి గృహాలలో కనీస వసతులు కల్పించేందుకు ప్రత్యేకంగా దృష్టి సారించాలని అన్నారు. విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చూడాలని స్పష్టం చేశారు. రాష్ట్ర కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా విద్యా రంగంపై దృష్టి సారించిందన్నారు. ఏపీని ఎడ్యూకేషన్, ఐటీ, టూరిజం, లాజిస్టిక్ హబ్ గా మార్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ప్రకటించారు. ఇక విద్యా పరంగా కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టామన్నారు నారా చంద్రబాబు నాయుడు.
హాస్టళ్లలో శానిటేషన్, ఆహార పదార్ధాల నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారించాలని ఈ సందర్భంగా సీఎం ఆదేశించారు. రెసిడెన్షియల్ స్కూళ్లు, హాస్టళ్ల నిర్మాణంతో పాటు సురక్షిత తాగు నీటి కోసం ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేయాలని అన్నారు. రాష్ట్రంలో 814 హాస్టళ్లలో రూ.17 కోట్ల వ్యయంతో మార్చి లోగా ఆర్వో ప్లాంట్లను ఏర్పాటు చేస్తామని అధికారులు వివరించారు. రూ.60 కోట్ల సాస్కి నిధులతో రెసిడెన్షియల్ పాఠశాలలు, హాస్టళ్ల నిర్మాణం చేపట్టాలని సీఎం ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత, ఆ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.





